ప్రారబ్ధ కర్మలు

జీవుడు తన శరీరమును చాలించినప్పుడు మిగిలిన ఆగామి కర్మ ఫలములను సంచితములు అని అంటారు. ఆ సంచితములలో ఏవైతే పక్వానికి వస్తాయో వాటిని ప్రారంభ కర్మ ఫలములు అని పిలుస్తారు. జీవుడు ఈ ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి అనువైన మరొక దేహమును వెతుక్కుంటూ మళ్లీ ఈ లోకంలోకి వచ్చిపడతాడు. ఆలా వచ్చినవాడు ప్రారబ్ధ కర్మలను అనుభవించవలసిందే. ఆలా అనుభవిస్తేనే ఆ ప్రారబ్ధ కర్మలు ఖర్చుఅవుతాయి.

ఎంత గొప్పవారైనా, ఎంతటి మహానుభావులైన, ఎంతటి పుణ్యాత్ములేన, దైవభక్తులైన ప్రారబ్ధ కర్మ ఫలములను అనుభవించక తప్పదు. ప్రారబ్ధ కర్మలు ధనుస్సు నుండి విడిచిన బాణముల వంటివి. ఎక్కడైనా, ఎవరికైనా తగలవలసిందే తప్ప వెనక్కి తిరిగి తెచ్చుకోలేము. మనం ఎక్కడికి వెళ్లినా ఈ పాట్లుపడినా ప్రారబ్ధ కర్మలను వదలలేమని వేమన చెప్పనే చెప్పారు.

ఎన్ని చోట్ల తిరిగి ఈ పాట్లు పడినను అంటనీయక శని వెంట తిరుగు
భూమి క్రొత్తదైనా భుక్తులు క్రొత్తవా విశ్వదాభిరామ వినురవేమ

రామాయణములో భరతుడు రాముడు అరణ్యమునకు వెళ్లిన విషయమును తెలుసుకొని దుఃఖిస్తూ వశిష్ఠుని దగ్గరకు వెళ్తాడు. వశిష్ఠుడు భరతుని ఓదారుస్తూ “సంతోషం, దుఃఖం, సుఖం, చావు, పుట్టుక, కీర్తి, అపకీర్తి అన్ని ప్రారబ్ధ వశమై ఉంటాయి. అవి ఎలా నిశ్చాయింపబడి వుంటాయో ఆలా వాటిని అనుభవించవలసిందే”. అని అన్నారు.

మనం రామాయణం గమనిస్తే – శబరి జీవితమంతా రాముని చూడాలని కోరికతో ఉంటే ఆమె చివరి క్షణంలో రాముడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. కౌసల్యకు చాలాకాలం పిల్లలు పుట్టలేదు. తరువాత రాముని కొంతకాలం చూసుకుంది. వెంటనే పుత్రవియోగం. అదే సమయంలో భర్త మరణం. ఇదే ప్రారబ్ధం.

అహల్యకు శ్రీరాముని పాదస్పర్శతో జన్మ వస్తే – దశరధునకు పుత్రవియోగంతో మరణం సంభవించింది. కన్నతండ్రికి చావు. ఎక్కడో వున్న అహల్యకు జన్మ – ప్రారబ్ధం.

శ్రీరాముని భార్యను అపహరించినవాడు రావణుడు. కాపాడవలసినది అయోధ్య. కానీ కాపాడింది వానర సైన్యం. కీర్తి వానరులకు మరి అపకీర్తి? ప్రారబ్ధం.

చిన్నతనంనుండి కైక శ్రీరాముని ఎంతో ప్రేమగా పెంచి పట్టాభిషేకసమయానికి శ్రీరాముని వనవాసమునకు పంపి ఎంతో అపకీర్తిని సంపాదించుకుంది. – ప్రారబ్ధం.

*ఇలాంటి కస్టాలు సుఖాలు
*వచ్చినప్పుడు మనం ధైర్యంతో వాటిని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి

*అనుభవించేటప్పుడు ఋణం తీరిపోతోంది అని సంతోషించాలి

*చేసిన కర్మలు ఖర్చు అయిపోతున్నాయి అన్న భావనలో ఉండాలి

*అప్పు తీరిపోతోంది అని ఆనందించాలి

*కష్టంలో కూడా ఎలా సంతోషంగాఉండాలి అన్న ప్రశ్నకు, భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది

పరమాత్మపై భక్తితో నామస్మరణా చేస్తూ,
భగవత్చిoతన చేస్తూ, ఆయనపై భారం వేసి, ప్రారబ్ధకర్మ ఫలములను అనుభవించాలి, అని చెప్పారు.

*కస్టాలు దుఃఖాలు కలకాలం వుండవు. కష్టముల తరువాత సుఖములు వస్తాయి* –

ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి యోగం.

ఒక పిల్లవాడు కొత్త సైకిల్ తొక్కుతూ కిందపడి దెబ్బతగిలింది. వెంటనే వెళ్లి వైద్యం చేయించి పడుకోబెట్టి సమయానికి అన్ని మందులు వాడగలం.

కానీ ఆ నెప్పి మాత్రం ఆ పిల్లవాడు అనుభవించాల్సిందే. ఆ నెప్పిని మనం తీసుకోలేము.

*మన ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి వేరెవరో వుండరు

*మనమే అనుభవించాలి. కానీ భక్తితో భగవంతుని ఆశ్రయిస్తే ఆ కష్టములను భరించగలిగే శక్తిని భగవంతుడు ఇవ్వగలడు

“తు.చ”తప్పకుండా అనగానేమి

*”తు.చ”తప్పకుండా అనగానేమి?*
====================
చెప్పిన పని చెప్పినట్టు చేస్తా అనడానికి “తు.చ” తప్పకుండా చేస్తా అంటూంటాం కదా!
ఈ తు.చ లేమిటి? ఎక్కడినుంచి వచ్చాయి? అని అడిగితే ‘ఎవరు తుమ్మినా, చచ్చినా సరే ఆ పని చేస్తా’ అని చెప్పడానికి ఈ మాట వాడుతుంటామోయ్ అని చెప్పాడో గడుసు పండితుడు.

తు .చ కు ఆయన సృజనాత్మకంగా చెప్పినా, వాస్తవం అదికాదు.
సంస్కృత శ్లోకాలను నిర్దేశిత ఛందస్సుల్లో వ్రాస్తారు కదా! ఛందస్సు అనగానే పాదానికి యిన్ని గణాలు అని లెక్క వుంటుంది.
ఒక్కోసారి శ్లోకంలో కవి చెప్పాలనుకున్న భావం పూర్తిగా వచ్చేసి నప్పటికీ గణాలేవో తక్కువపడి ఛందస్సు సరిపోదు.
అలాంటి సందర్భంలో శ్లోక భావాన్ని మార్చకుండా, కొత్త పదాలను కలపకుండా ఛందస్సులోని ఖాళీ లన్నీ పూరించడానికి ‘తు,చ’ అనే అక్షరాలను పెట్టేవారు.
తర్వాత ఎవరైనా ఆ శ్లోకాన్ని మరో భాషలోకి అనువదించేటప్పుడు ఆ ‘తు’ ‘చ’ లతోసహా మక్కికి మక్కి అనువాదం చేశారనుకోండి! తు,చ తప్పకుండా చేశారు అనడం అలవాటు.
అందరికీ తెలిసిన
“ధర్మేచ,అర్థేచ , కామేచ” శ్లోకంలో ఆ ‘చ’ లేకున్నా అర్థం ఏమీ మారిపోదు. అలాగే “మమ కుర్వ౦తు” లో కూడా గణాలను సరిపెట్టడానికి మాత్రమే వీటిని వాడారన్నమాట.
అనువాదం చేసేటప్పుడు ఈ ‘తు’ ‘చ’ లతో సహా చేస్తే అదే ‘తు’ ‘చ’ తప్పకుండా.
…..వాట్సాప్ సౌజన్యముతో

ఆత్మ రక్షణ

#ఒక_కప్పను_ఒక_నీళ్ళగిన్నెలో
#ఉంచి_ఆ_గిన్నెను_పొయ్యి_మీద_ఉంచితే..

#కాసేపటికి నీళ్ళు కొంచెం వేడి అవ్వటం మొదలవుతుంది, ఆ నీళ్ళ వేడికి తగ్గట్టుగా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటుంది..

#ఇంకొంచెంసేపు తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువ వేడి అవుతాయి, అప్పుడు కూడా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను నీటి వేడికి తగ్గట్టుగా మార్చుకుని నీటి వేడిని ఓర్చుకోగలుగుతుంది..

#ఇలా_కొన్నిసార్లు జరిగినతరువాత ఇక నీళ్ళు పూర్తిగా మరిగినంత స్థితికి చేరాక కప్ప తన శరీర ఉష్ణోగ్రతను ఇంక మార్చుకోలేదు, ఇక అప్పుడు కప్ప నిర్ణయించుకుంటుంది, నీళ్ళగిన్నెలోంచి ఇక బయటకు దూకేద్దాము అని…

#కానీ_దూకలేకపోయింది, ఎందుకంటే అప్పటివరకూ శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటూ నీటి వేడిని భరించటంలోనే కప్ప శక్తి అంతా హరించుకుపోయింది, వేడి నీళ్ళ గిన్నెలోంచీ దూకే శక్తి లేక నీరసపడిపోయింది…

#కాసేపటికి కప్ప చనిపోయింది…

కారణం వేడినీళ్ళా…కానే కాదు

#ఎప్పుడు గిన్నెలోంచి దూకాలో సరైన సమయంలో సరైన నిర్ణయం కప్ప తీసుకోలేకపోయింది..అదే అసలైన కారణం..

#మనుష్యులతో పరిస్థితులతో సర్దుకుంటూ బతకటం జీవితానికి చాలా అవసరమే..

కానీ శారీరకంగానో, మానసికంగానో, ఆర్ధికంగానో, ఆచారాల పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, భావాలపరంగా బలహీనపరుస్తూనో..ఒకరు లేదా కొందరు మరొకరిని ఇబ్బంది పెడుతుంటే, బాధపెడుతుంటేనో కొంతకాలం, కొంత హద్దువరకు భరించినా పరవాలేదు…

కానీ అదే పద్ధతి ఇరువైపులవారికి ఒక మార్చుకోలేని అలవాటుగా మారినప్పుడు…బాధపడేవారు ఎల్లకాలం భరిస్తూ ఉండి బలై పోవడం మంచిది కాదు…

#సరైన_సమయంలో బాధనుంచి తనను తాను రక్షించుకోవడం , బాధాకరపరిస్థితులకి, బాధపెట్టే మనుష్యులకి దూరంగా వెళ్ళడం అనేది సహజసిద్ధంగా నేర్చుకోవలసిన ఆత్మరక్షణ…

ఎవరో_వస్తారని_ఏదో_చేస్తారని ఎదురుచూస్తూ సమయం ముగిసిపోయేవరకు ఉండి బలయి పోయేకంటే, సమయం ఉన్నప్పుడే కళ్ళు
తెరుచుకుని ధైర్యంగా, సరైన శక్తి ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మంచి జీవితానికి చాలా అవసరం..

పెళ్లి – షష్టి పూర్తి

పెళ్లి సాధారణంగా జరగాలి.
షష్టిపూర్తి ఘనంగా జరగాలి

1. మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది.

2. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి.
3. ప్రతివారికీ మృత్యువు
60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో ,
70 వ యేట భీమరథు డు అను పేరుతో,

78 వ యేట విజయరథు డు అను పేరుతో ఎదురుచూస్తుంటాడు.

4. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.

5. బృహస్పతి , శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.

6. మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.

7. షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము

8. పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.

9. ‘’ తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు . వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం ” అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను,తిదులను వారములను – వారదేవతలు అయిన – సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు – వీరికి అధిదేవతలు – అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు – వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ – ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు.తదుపరి బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు.

10. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.

11. పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక.

12. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి.

13 . కుటుంబ ఐక్యతను చూసి పెద్దలు పరమానందభరితులయ్యే మధురక్షణాలీ షష్టిపూర్తిమహోత్సవ వేడుకలు .
విషయ సేకరణ

🙏సర్వేజనా సుఖినోభవంతు🙏

పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు

*పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు*

ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు. వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచన తో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి. అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరే టట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇది శాస్త్ర ప్రమాణాలు ను అనుసరిస్తూ *observe చేసినది. Straight* గా శాస్త్రం లో ఎక్కడా లేదు.

*మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం*

ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,చిత్తచాంచల్యం,అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం

*జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం*

ఫలితం: దీనివల్ల (వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం‌ ఆచరించాకే మిగతావి)
కలిగే నష్టం
వారిమధ్య ప్రేమ లోపించటం

*ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం*

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం

*తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం*

ఫలితం: దీనివలన
బంధు ద్వేషం ఆర్థిక ఇబ్బదులు

*బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం*

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం

బఫే భోజనాలు

ఫలితం:దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం*

*వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటిస్థానంలో సినిమా పాటలు వినటం*

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం

ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి….

అందరికి చెప్పండి, చెప్పక పోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ బాగుపడేది మరు జన్మకే

క్రియా యోగం

క్రియా యోగం – పరమ హంస యోగానంద :

ప్రపంచమంతా సంచలనం కలిగించి,అనేక భాషలోకి అనువదించబడి,పలు ప్రచురణలు పొంది– లక్షలాది మంది జీవితాలను మార్చిన గ్రంధాలలో “Autobiography of a Yogi” ఒకటి. దీనిని వ్రాసిన పరమహంస యోగానందగారు, శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి శిష్యుడు. ఆయన లాహిరీ మహాశయుల శిష్యుడు. లాహిరీ మహాశయుడు బాబాజీగారి శిష్యుడు. బాబాజీ అనే మహనీయుడు రెండువేల సంవత్సరాల నుంచి బ్రతికే ఉన్నాడంటారు ! ఈయన నివాసస్థలం హిమాలయాలలోని “తెహ్రీ ఘర్వాల్” ప్రాంతం. ఈయన ఈనాటికీ అదృష్టవంతులకు కనిపిస్తూ ఉంటాడు, అని అంటారు…..
ఈయనకు కాలం, దూరంతో సంబంధం లేదు. ఈయన పరా ముక్తత్వం వలన కాంతి శరీరంతో ఎక్కడైనా ప్రత్యక్షం కాగలరు.

భగవానుడు సూర్యునికి నేర్పిన యోగం కాల క్రమేణా క్షయమై పోగా, నవీన కాలంలో దీనిని తిరిగి ఉద్ధరించిన మహాత్ముడు బాబాజీ. దీనినే ‘క్రియాయోగం’ అని అంటారు. దీనిని గురు ముఖతా నేర్చుకోవాలి. దీనిని బాగా అభ్యాసం చేస్తే 12 సంవత్సరాలలో భగవత్(సత్య) దర్శనం పొందటానికి అనువుగా శరీరాన్ని తయారు చేస్తుంది. క్రియా యోగంలో ముఖ్య మైన అంశం “క్రియా కుండలినీ” ప్రాణాయామం. దీనిని అభ్యాసం చెయ్యటం ద్వారా వెన్నెముకలో గల నాడులు, చక్రములు ఉత్తేజితములై సాధకునికి అనాహత
నాదం వినబడుతుంది. భ్రూ మద్యంలో వెలుగు కనిపిస్తుంది. శరీరంలోగల అన్ని ప్రాణ నాడులు ఉత్తేజాన్ని పొందుతాయి.
క్రియా యోగంలో అయిదు మెట్లు ఉన్నాయి. మొదటి క్రియాదీక్షతోనే చాలా వరకు సాధన జరుగుతుంది. సాధకుని పురోగతిని బట్టి తరువాతి దీక్షలు ఇవ్వ బడుతాయి. కొందరికి పరమ గురువుల దర్శనం కలుగుతుంది. వారి ద్వారానే తరువాతి దీక్షలు ఇవ్వబడవచ్చు.క్రియాయోగమన్నది,మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింప చేసి,ప్రాణ వాయువుతో నింపే ఒకానొక మానసిక-శరీరక ప్రక్రియ. అనేక మంది ప్రసిద్ధ యోగులు, ముక్త కాములు మొదలైన వారు ఈ ప్రక్రియను ఉపయోగించి ఫలితాలను సాధించారు…భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ఈ క్రియాయోగాన్ని గురించి రెండు చోట్ల ప్రస్థావించారు.నాల్గవ అధ్యాయం,29 వ శ్లోకమిలా చెబుతుంది.

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే ।
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ।। 29 ।।

అర్ధాన్ని వివరిస్తాను–యోగి,ఊపిరితిత్తులు ,గుండె చేసే పనిని నెమ్మదిచేసి, దాని ద్వారా అదనంగా ప్రాణశక్తి సరఫరా అయేటట్లు చేసుకొని,శరీరంలో జీవకణ క్షయాన్ని అరికడతాడు.అంతే కాకుండా,అతను,అపానాన్ని(విసర్జక ప్రవాహం) అదుపు చేసుకొని శరీరంలో పెరుగుదలకు సంబంధించిన మార్పులను కూడా అరికడతాడు.ఈ ప్రకారంగా యోగి తన శరీరంలో అరుగుదల,పెరుగుదలలను నిలిపివేసి, ప్రాణశక్తిని అదుపులో ఉంచుకుంటాడు.మరో రెండు శ్లోకాలలో ఇలా ఉంది (అయిదవ అధ్యాయం,27 ,28 శ్లోకములలో).అర్ధం మాత్రం వివరిస్తాను.

కనుబొమల మధ్య బిందువు మీద చూపు నిలపడం వల్లా,ముక్కుల్లోను ఊపిరితిత్తుల్లోనూ (ఆడే) ప్రాణ,అపాన వాయువుల సమ ప్రవాహాలని తటస్థీకరించటం వల్లా సర్వోన్నత లక్ష్యాన్ని సాధించ బూనిన ధ్యానయోగి,బాహ్య విషయాలనుంచి వెనక్కి తగ్గ గలుగుతాడు. మనస్సునూ, బుద్దినీ అదుపు చెయ్యగలుగుతాడు. కోరికనూ,భయాన్నీ,కోపాన్నీ పార ద్రోలగలుగుతాడు.శాశ్వతంగా విముక్తుడౌతాడు. నాశరహితమైన ఈ యోగాన్ని,వెనకటి ఒక అవతారంలో,ప్రాచీన జ్ఞాని అయిన వివస్వతుడికి తనే ఉపదేశించానని కూడా శ్రీ కృష్ణుడు చెబుతాడు. ఆ వివస్వతుడు,
మహా ధర్మ శాసకుడైన మనువుకు ఉపదేశించాడని కూడా శ్రీ కృష్ణుడు చెబుతాడు.యోగవిద్యకు ప్రధమ శాస్త్రకారుడని చెప్పబడే “పతంజలి మహర్షి” ,క్రియా యోగాన్ని రెండు సార్లు పేర్కొంటూ,ఇలా చెబుతాడు–శరీర వ్యాయామం,మనోనిగ్రహం,ఓంకారం మీద ధ్యానం కలిస్తే క్రియాయోగం అవుతుంది. రెండవ సారి “పతంజలి” ఇలా చెబుతాడు–శ్వాస,నిశ్వాసాల గతిని విచ్ఛేదించటం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తిని సాధించవచ్చు.

“క్రియాయోగం, మానవ పరిణామాన్ని త్వరితం చెయ్యటానికి ఉపకరించే సాధనం” అని అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గిరిగారు.తన శరీరం మీదా,మనస్సు మీదా తానే ఆధిపత్యం వహించిన వాడై,క్రియాయోగి చివరకు,”చివరి శత్రువు” అయిన మృత్యువును జయిస్తాడు.

క్రియా యోగంలోని మొదటి దీక్షలో ముఖ్యమైన అంశాలు. తాలవ్యక్రియ,ఖేచరీముద్ర, చక్రజపం, క్రియాకుండలినీ ప్రాణాయామం, నాభిక్రియ మరియు షణ్ముఖీ ముద్ర. వీనికి సోహం జపం మరియు ఆజ్ఞా చక్రధారణ అనేవి సహాయ కారులు. మహాముద్ర మరియు శాంభవీముద్ర అనేవి ముఖ్యమైన అంగములు.

ఈ క్రియలను చక్కగా అభ్యాసం చేయడం వల్ల మనిషి ముఖంలో తేజస్సు పెరుగుతుంది. కళ్ళలో కాంతి కలుగుతుంది. స్వభావంలో నిర్మలత్వం కలుగుతుంది. సాధనా క్రమంలో ఓంకార నాదం వినవచ్చు. అయిదు అంచులు గల నక్షత్రాన్ని దాని మధ్యలో తెల్లని చుక్కను భ్రూమద్యంలోచూడవచ్చు. ఆ చుక్క ద్వారా ఆవలికి ప్రయాణిస్తే అతీత లోకాల లోనికి ప్రయాణం చెయ్యవచ్చు. మహనీయుల దర్శనాలు, పూర్వ జన్మజ్ఞానం, దూరశ్రవణం, దూరదర్శనం వంటి సిద్ధులు దారిలో వాటంతట అవే కలుగుతాయి.ఈ క్రియాయోగాన్ని శ్రద్ధగా ఆచరించిన కొందరు తమ రక్తపు గ్రూపు కూడా మార్చుకున్నారట…..!(అంటే,B+ వారు, B- కు మార్చుకున్నారు).ఈ క్రియా యోగాన్ని విశేషంగా ప్రచారం చేసిన శ్రీ పరమహంస యోగానంద ,మరణించే చివరి నిముషంలో కూడా చిరునవ్వుతోనే మరణించాడు.

నవగ్రహాల శక్తి

నవగ్రహాల శక్తి గురించి మీకు తెలుసా?

గ్రహానికి శాంతి చేయించుకోమని జ్యోతిష్యులు చెప్పారా? గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. మనకు నవగ్రహాలున్నాయి. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.

ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు. నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు.

గురువును ఆరాధిస్తే.. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం.. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు.

ఇక బుధ గ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస్తే.. తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని.. దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు. కేతువు తర్వాతి గ్రహం శుక్రుడు. శుక్రాచార్యుడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు. సంతానాన్ని ఇవ్వగలుగుతాడు.

ఇక గ్ర‌హాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే.. గ్రహదోషమని భావించాలి. అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యులను సంప్రదించి వారి సూచనల మేరకు, ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు.

శయన నియమాలు

పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:

1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు.
*దేవాలయం* మరియు *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.
*(మనుస్మృతి)*

2. పడుకుని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు.
*(విష్ణుస్మృతి)*

3. *విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును.
*(చాణక్య నీతి)*

4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం *బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి.
*(దేవీ భాగవతము)*
పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.
*(పద్మ పురాణము)*

5. *తడి పాదము* లతో నిద్రించవద్దు.
పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి(ధనం)ప్రాప్తిస్తుంది.
*(అత్రి స్మృతి)*
విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం.
*(మహాభారతం)*

6. *నగ్నంగా, వివస్త్రలులై* పడుకోకూడదు.
*(గౌతమ ధర్మ సూత్రం)*

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య,* పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని, మృత్యువు,* ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో *ధనము, ఆయువు* ప్రాప్తిస్తుంది.
*(ఆచార మయూఖ్)*

8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు.
కానీ *జ్యేష్ఠ మాసం* లో
1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.
(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు *రోగి* మరియు *దరిద్రులు* అవుతారు.
*(బ్రహ్మా వైవర్తపురాణం)*

10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు గంటల) తరువాతనే *పడుకోవాలి*

11. ఎడమవైపు పడుకోవడం వలన *స్వస్థత* లభిస్తుంది.

12. దక్షిణ దిశలో *పాదములు* పెట్టి ఎపుడు నిద్రించకూడదు.
*యముడు* మరియు *దుష్ట గ్రహము* ల నివాసము ఉంటారు.
దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది.
*మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు, మృత్యువు* లేదా
*అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.

13. గుండెపై చేయి వేసుకుని, *చెత్తు యొక్క బీము* కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14. పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.

15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది)

16. నుదుటన బొట్టు లేదా తిలకం ధరించి నిద్రించడం *అశుభం* కావున పడుకొనే ముందు తీసివేయండి.

*ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు.*

నక్షత్ర ఆధారిత ఉపశమనాలు

జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను.

నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను.
జ్యోతిష శాస్త్రము మరియు కర్మ సిద్ధాంతానికి చాలా అవినాభావ సంబంధము కలదు. మన కర్మలను అనుసరించి మనకు జన్మ లభిస్తుంది. మన కర్మ ఫలాలను తెలిపేదే జ్యోతిషము, జన్మ కుండలి మరియు అందులో గల యోగాలు. మనము అనుభవించే సత్ఫలితము లేదా దుష్ఫలితము అన్ని కూడా కర్మ ఫలాలే. సత్ఫలితాలుంటే అందరికీ సంతోషము. కాని దుష్ఫలితాలు అనుభవించ వలసి వచ్చినపుడు అసలు ఆ దోషమేంటి మరియు దానికి ఏదైనా పరిహారము ఉందా అనే విషయము గూర్చి మనము మనన చేసుకుంటాము. నాకుండే పరిజ్ఞానము మరియు అనుభవాన్ని అనుసరించి దోషానికి పరిహారము లేదు. ఏలనన దోషాలు మన కర్మ ఫలాలు. కర్మ ఫలాలు అనుభవించ వలసిందే. దానికి విరుగుడు లేదు. ఐతే దానికి ఉపశమనాలు ఉంటాయి. ఉపశమనము – పూజలు, జపాలు, దానాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు ఇలా ఎన్నో రకాల ఉపశమనాలు ఉంటాయి. ఈ ఉపశమనాల వలన మనలో మనోబలం పెంపొందుతుంది. భగవంతుని పట్ల నమ్మకము పెరుగుతుంది. మనకు ఎదురగు కష్టాన్ని ఎదుర్కునే శక్తి మనలో వస్తుంది. మనకు ఎదురగు కష్టాలను అత్యంత సునాయాసంగా మనము ఎదుర్కొన గలుగుతాము. ఉపశమనాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనము అత్యంత సులభమైన మరియు ఇతరుల సహాయం లేకుండా మనమే స్వంతగా ఆచరించదగు ఉపశమనాల గూర్చి తెలుసుకొందాము. “లాల్ కితాబ్” అనే గ్రంథము లో కూడా చాలా విధాల ఉపశమనాల గూర్చిన చర్చ ఉంది. ఇట్టి ఉపశమనాలు మరియు ఇతర ప్రామాణిక గ్రంథాలు, స్వతహాగా నాకుండే అనుభవాన్ని జోడించి మీకు కొన్ని సులభమైన ఉపశమన పద్దతులను అందిస్తున్నాను.
ఇట్టి శీర్షికలో మనము ప్రధానముగా జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను.

అశ్విని:
అశ్విని నక్షత్రము నాలుగు చరణాలు – చు, చే చొ, ల – అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారందరూ అశ్విని నక్షత్ర జాతకులు. వీరు దేవా గణానికి చెందిన వారు. వీరి నక్షత్రానికి అధిపతి కేతువు. నక్షత్ర అధిష్టాన దేవత అశ్విని దేవతలు. వీరందరూ కూడా మేష రాశికి చెందినా వారు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు. మంగళవారము నాడు ఉపవాస దీక్షలు
౨. నిరుపేదలకు వైద్య సహాయాన్ని అందించడం
౩. ఉలవలతో చేసిన వంటకాన్ని భుజించడం
౪. ఉలవలు దానం ఇవ్వడం (బ్రాహ్మణుడికి – మంగళవారం నాడు)
౫. వైఢూర్యము మరియు పగడము ధరించడం – వైఢూర్యాన్ని మరియు పగడాన్ని దానం చేయడం (జాతి రత్నాలు ధరించేటపుడు జాగ్రత్తగా ఉండాలి)
౬. లోహంతో చేసిన (ఇత్తడి, రాగి లేదా పంచ లోహాలు) చేసిన అశ్వ ప్రతిమను ఇంటికి వాయువ్య మూలలో అమర్చాలి. ఇట్టి ప్రతిమను దక్షిణ ముఖము ఉండే విధంగా అమర్చాలి. ఇట్టి ప్రతిమ యొక్క ప్రత్యేకమైన ప్రమాణం లేదా సైజు అనేది ఏమీ లేదు. అశ్వ పటము అనగా ఫోటో అనుకున్నంతగా సత్ఫలితాలను ఇవ్వలేక పోవచ్చును (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి) దీన్ని చాల సులువుగా మన గృహము నందు అమర్చుకొన వచ్చును.

భరణి
భరణి నక్షత్ర నాలుగు చరణాలు మేష రాశి యందే ఉండుట వలన భరణ నక్షత్ర జాతకులు మేష రాశికి చెందినా వారై ఉంటారు. లి, లు, లే, లో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత ‘యముడు’. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి. వీరికి తూర్పు ఉత్తర దిశలు శుభము మరియు పశ్చిమ దక్షిణ దిశలు అధమాలు.
ఉపశమనాలు:
౧. శివ పంచాక్షరి జపం
౨. రుద్రార్చనలు – ఇంటియందు స్పటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్ఛారణ తో ప్రతి నిత్యం శివ లింగానికి అభిషేకం చేయడం
౩. పొట్టుతో ఉన్న బబ్బెర్లు భుజించడం (పొట్టుగల భిన్నము చేయని ధాన్యము నీటియందు నానబెట్టుకుని భుజించడం వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యం)
౪. బబ్బెర్లు, లవణం, పత్తి (గింజలు తీయని పత్తి) దానం చేయడం
౫. ఇంట్లో ప్రత్తి మొక్క పెట్టుకొని ప్రతి నిత్యం దానికి నీరు పోయడం
౬. పంచదార తో చేసిన బబ్బెర/శనగ/పెసర/కంది (ధాన్యానికి పొట్టు ఉండాలి) పూర్ణం ప్రతి నిత్యం శ్రీ మహా లక్ష్మికి నైవేద్యం చేసి తినాలి, వివాహం అయిన వారైతే భార్యాభర్తలు ఇరువురు తినాలి (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).

కృత్తిక
కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు. మరియు అధిష్టాన దేవత అగ్ని. కృత్తిక నక్షత్ర ప్రధమ చరణము మేష రాశి యందును మరియు మిగిలిన మూడు చరణాలు వృషభ రాశి యందును ఉంటాయి. అ, ఇ, ఉ, ఎ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు. కృత్తిక మేష రాశి యందు జన్మించిన వారికి పశ్చిమ దక్షిణ దిశలు ప్రతికూలంగా ఉంటాయి. కృత్తిక వృషభ రాశి యందు జన్మించిన వారికి ఉత్తర దిశ ప్రతికూలంగా ఉంటుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. శివ పంచాక్షరి, శివ మానస పూజ, ఆదిత్య హృదయ పారాయణము
౨. రుద్రార్చనలు – ఇంటియందు స్పటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్ఛారణ తో ప్రతి నిత్యం శివ లింగానికి అభిషేకం చేయడం
౩. బెల్లంతో గోధుమల పాయసము ఆదివారం భుజించుట వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యము.
౪. తెల్ల సంపంగి, జాజి మల్లె, మాలతి మరియు నందివర్ధనం పుష్ప వృక్షాలను పెంచుకోవడం. వాటితో శివార్చన.
౫. గృహ/కుల సిద్ధాంతి మరియు పురోహితుల ను తరచూ కలవడం వారి ఆశిస్సులు ప్రతి సారి పొందడం (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
౬. వేదపండితుల శుశ్రూష – వారి పాదాలకు నమస్కరించుట – ఆశిస్సులు పొందుట (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
౭. దేవాలయాలయందు కామ్యాపెక్ష లేకుండా తెలుపురంగులో గల పుష్పాలను పూజకై పంపించడం. శర్కర తో వండిన శ్వేతాన్నం నివేదన చేయడం. ఇట్టి వాటియందు కామ్యాపెక్ష ఏమాత్రం ఉండరాదు. (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).

రోహిణి:
రోహిణి నక్షత్ర నాలుగు చరణాలు వృషభ రాశియందే ఉంటాయి. ఓ, వ, వి, వు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మనామాక్షరము గల వారు, జన్మ నామము లేని వారికి వ్యవహార నామాక్షరము గల వారందరూ రోహిణి నక్షత్రానికి చెందిన వారే మరియు వారు వృషభ రాశికి చెందిన వారే. వీరిది మనుష్య గణము. వీరికి పశ్చిమ మరియు తూర్పు దిశలు అనుకూలంగా ఉంటాయి మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమములు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు
౨. తెలుపు రంగు వస్త్రాలు ధరించడం
౩. తెల్లని ధాన్యము మరియు తెలుపు రంగు వస్త్రాలు బ్రాహ్మణోత్తమునికి దానము చేయడం
౪. శివునికి గోక్షీరము తో అభిషేకము
౫. శ్రీ లలితాంబ కు త్రిమధుర నైవేద్యము (ఆవుపాలు, తేనే, శర్కర)
౬. తెల్లని ఎద్దును శివాలయంలో పూజించడం. వాటికి గ్రాసము తినిపించుట.
౭. గోశాలకు గోగ్రాసమును సమకూర్చుట
౮ గోవులకు సేవ చేయడం

మృగశిర:
మృగశిర ప్రథమ ద్వితీయ చరణాలు వృషభ రాశి యందును, తృతీయ చతుర్థ చరణాలు మిథున రాశి యందును ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులు దేవ గణమునకు చెందిన వారు. వె, వో, క, కి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు లేదా వ్యవహార నామము గల వారు ఈ నక్షత్ర కోవకు వస్తారు. మృగశిర ప్రథమ ద్వితీయ నక్షత్ర జాతకులకు తూర్పు దిశ శ్రేష్టమైనది. మిగిలిన దిశలు మాధ్యమాలు. తృతీయ చతుర్థ చరణాల వారికి తూర్పు ఉత్తర దిశలు శ్రేష్టము. మిగిలిన దిశలు మధ్యమ లేదా అధమములు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. అంగారక చతుర్థి, అంగారక షష్టి, సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు
౨. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన, పైన తెలపబడిన దినములందు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు
౩. ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు ధాన్యము బ్రాహ్మణోత్తమునికి దానము చేయుట
౪. ఎర్రని కందులు శర్కర తో చేసిన పూర్ణము శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయుట.
౫. వీరు నలుపు మరియు నీలము రంగు వస్త్రాలను దరించ రాదు
౬. వార్తాహరునికి (వార్తలు చేరవేయు వారు, దూతలు) ఎరుపు రంగు వస్త్రాలు బహుకరించుట
౭. సంగీత వేత్తలకు ఎర్రని వస్త్రములు బహుకరించి వారి ఆశిస్సులు పొందుట.
౮. శ్రీ దుర్గ అమ్మవారికి ఎర్రని వస్త్రమును బహుకరించుట. శ్రీ దుర్గా ఆలయమందు ఎర్రని వస్త్రాలు దానం చేయుట.
౯. దేవాలయాలయందు పళ్ళు దానం చేయుట.

ఆర్ద్ర:
ఆర్ద్ర నక్షత్ర 4 చరణాలు మిథున రాశిలోనే ఉంటాయి. కావున ఆర్ద్ర నక్షత్రము ఏ పాదములో జన్మించినను వారు మిథున రాశికి చెందిన వారే. కూ, ఘ, జ్ఞ, ఛ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామ మరియు వ్యవహార నామము గల వారందరూ ఈ రాశి కోవకే వస్తారు. ఈ నక్షత్ర జాతకులు మనుష్య గణము నకు చెందిన వారు. ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత ‘రుద్రుడు’. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభాలు మరియు పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమ ఫలాలను ఇస్తాయి. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. రుద్రార్చనలు వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౨. ప్రతి నిత్యము స్పటిక లింగానికి ఆవు పాలతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అభిషేకించడం.
౩. బియ్యాన్ని నానబెట్టి అట్టి నానిన బియ్యముతో శివుడిని అభిషేకించుట.
౪. నల్లని లేదా నీలి వర్ణము గల వస్త్రములకు సాధ్యమైనంత వరకు దూరముగా ఉండుట.
౫. శ్రీ సుబ్రహ్మణ్య యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతి నిత్యం దానికి విభూదితో అర్చన చేయుట
౬. ప్రతి నిత్యం ఆహారంలో రెండు విధాల పప్పు దినుసులను వాడుట వీరికి శుభ ఫలాలను ఇస్తుంది.
౭. చోరులను మరియు మోసగాళ్ళను పట్టించుట లో సహాయపడుట.
౮. జంతు వధ నిషేధాన్ని వీరు సమర్థించాలి.
౯. నిరంతరమూ శివపంచాక్షరి జప చేస్తూ ఉండాలి. అదే వీరికి సర్వ విధాల రక్ష.

పునర్వసు:
పునర్వసు నక్షత్ర ౩ చరణాలు మిథున రాశి యందును మరియు చతురత చరణము కర్కాటక రాశి యందును ఉంటుంది. కే, కో, హ, హి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహారము నామము గల వారందరూ కూడా ఈ నక్షత్ర జాతకులే. ఈ నక్షత్రములో జన్మించిన వారు దేవగణ జాతకులు. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభాలు మరియు పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమ ఫలాలను ఇస్తాయి. ఈ నక్షత్రానికి అధిపతి గురు మరియు అధిష్టాన దేవత ‘అదితి’ జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వేదపండితులు మరియు సద్బ్రాహ్మణ ఆశిస్సులు పొందడం మరియు వారి శుశ్రూష
౨. పేద బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా దానం
౩. వృద్ధ బ్రాహ్మణులకు చేయూతనందించుట
౪. శ్రీ దత్తాత్రేయుని ఆరాధన
౫. గురు దేవుల ఆశిస్సులు పొందుట
౬. మేలిరకం బియ్యం తో అన్నదానం
౭. మేలిరకం బియ్యాన్ని ఊరికి పడమర దిశలో ఉన్న లేదా ఊరికి దగ్గరగా ఉన్న శివాలయానికి దానం చేయుట.

పుష్యమి:
పుష్యమి నక్షత్ర నాలుగు చరణాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. హు, హి, హో, ఢ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు లేదా వ్యవహార నామము గల వారందరూ పుష్యమి నక్షత్ర కర్కాటక రాశికి చెందినా వారే. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు మరియు అధిష్టాన దేవత బృహస్పతి. ఈ నక్షత్రమున జన్మించిన వారందరూ కూడా దేవ గణము నకు చెందిన వారు. వీరికి తూర్పు, ఉత్తర మరియు దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ ఫలాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. యజ్ఞ యాగాదులు చేయు ఋత్త్విక్కులను గౌరవించడం – వారి ఆశిస్సులు పొందడం
౨. యజ్ఞ యాగాదులు నిర్వహించకున్నను వాటిని దర్శించు కోవడం మరియు యజ్ఞ నారాయణుడి ప్రసాదం స్వీకరించడం
౩. సాధు సత్పురుషులు, బ్రహ్మజ్ఞానుల ఆశిస్సులు పొందడం. వారికి తగిన విధంగా సేవలందించడం.
౪. ఈ నక్షత్రము లో జన్మించిన వారు రాజాజ్ఞను ఎట్టి పరిస్థితిలో నైనా తిరస్కరించ రాదు. రాజాజ్ఞ పాలన వీరు తప్పక చేయాలి.
౫. రాజు వద్ద గల మంత్రుల వద్ద శిష్యరికం చేయడం.
౬. గోధుమలు, యవలు(బార్లీ), బియ్యం మరియు చెరుకు మొదలు వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం చేయుట. ఇట్టి వస్తువులను శివాలయంలో దానం చేయుట.
౭. గురువులను పూజించుట మరియు వారి ఆశిస్సులు పొందుట వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౮. ఇంటిలో దక్షిణ గోడకు ఉత్తర అభిముఖంగా శ్రీ దత్తాత్రేయుని ప్రతిమను ఉంచిన వీరికి అత్యంత శుభ ఫలితాలు అందుతాయి. ఇట్టి ప్రతిమకు నిత్యం ధూప దీప నైవేద్యాలు చేసిన ఇంకను చక్కని సత్ఫలితాలు ఉంటాయి.
౯. గురువారము పుష్యమి నక్షత్రము వచ్చిన రోజున గురు పుష్యమి యోగము – అట్టి యోగము గల నాడు లేదా రోజున గురువుల ఆశిస్సులను పొందుట, శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సద్గురు సాయినాధుని దర్శనము శుభ ఫలితాలను ఇస్తుంది.

ఆశ్రేష:
ఆశ్రేష నక్షత్రము నాలుగు చరణాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందినా వారు. డీ, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా ఆశ్రేష నక్షత్ర కర్కాటక రాశికి చెందిన వారు. ఆశ్రేష నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత ‘సర్పము’. తూర్పు మరియు ఉత్తర దిశలు సత్ఫలితాలను మరియు దక్షిణ పశ్చిమ దిశలు వీరికి మధ్యమ లేదా అధమ ఫలితాలను ఇస్తాయి. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వైద్యులను, వైద్య వృత్తిలో ఉన్న వారిని సన్మానించుట
౨. సర్పారాధన, సర్ప ప్రతిమలకు లేదా విగ్రహాలకు మంగళ వారాలు ఆవుపాలతో అభిషేకించుట.
౩. పెసళ్ళు లేదా పెసరపప్పు నాన బెట్టి శ్రీ దుర్గాదేవికి నివేదించి స్వీకరించాలి
౪. పెసళ్ళు లేదా పెసరపప్పు శర్కర తో పూర్ణం వండి అమ్మవారికి నివేదించి భుజించాలి.
౫. సీసం తో గాని లేదా రాగితో గాని లేదా వెండితో తో చేసిన సర్ప ప్రతిమను చెరువులోనో, నదిలోనో లేదా నూతిలోనో ఆశ్రేష నక్షత్రము గల దినము నాడు వేయాలి.
౬. ఆశ్రేష నక్షత్రము గల రోజు సర్ప విగ్రహాన్ని లేదా ప్రతిమను అభిషేకించుట.
(ఆశ్రేష నక్షత్ర ఉపశమనాలు జాతకమున సర్ప దోషము గల వారికీ మరియు కాల సర్ప దోషము గల వారికి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి)

మఖ:
మఖ నక్షత్ర 4 చరణాలు కూడా సింహ రాశిలోనే ఉంటాయి. మఖ నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. మా, మీ, ము, మే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ మఖ నక్షత్ర సింహ రాశికి చెందిన వారే. మఖ నక్షత్రానికి అధిపతి కేతువు మరియు అధిష్టాన దేవతలు “పితృ”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలితాలను దక్షిణ దిశ మధ్య పశ్చిమ దిశా అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరు పితృ దేవతల ప్రీత్యర్థం తర్పణలు దానాలు చేస్తూ ఉండాలి.
౨. ముసలి వారికి, రోగ గ్రస్తులకు నిరంతరం సహాయం అందిస్తూనే ఉండాలి.
౩. తల్లిదండ్రుల ఆశిస్సులు నిరంతరం పొందుతూ ఉండాలి. మరియు వారికి సరియైన విధంగా సేవలు చేస్తూ ఉండాలి
౪. పూర్వీకుల ప్రీత్యర్థం దాన ధర్మాదులను ఆచరించాలి.
౫. ఈ నక్షత్ర జాతకులు మాతా పితరులకు సేవ చేయని ఎడల – మాత్రు శాప మరియు పితృ శాప సుతక్షయమనబడే యోగాల వలన బాధపడలసి ఉంటుంది.
౬. వీరు కొండలు మరియు ఎత్తైన ప్రదేశం లో ఉన్న శివాలయాలు లేదా ఇతర ఆలయాలందు వెలసి ఉన్న దేవతలను దర్శించు కోవాలి. ఇట్టి దేవాలయాలయందు దాన ధర్మాదులను ఆచరించాలి.
౭. ఉలవలు దానం చేయడం మరియు ఉలవలను వంటకాలందు వాడుట మరియు ఇట్టి నక్షత్ర జాతకులు భుజించుట.

పూర్వా ఫల్గుణి (పుబ్బ)
పుబ్బ లేదా పూర్వ ఫల్గుణి నక్షత్రము నందలి 4 చరణాలు కూడా సింహ రాశియందు ఉంటాయి. మో, ట, టి, టు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు జన్మ నక్షత్రము గల వారందరూ కూడా పుబ్బ నక్షత్ర సింహ రాశికి చెందినా వారే. ఈ నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. పూర్వాఫల్గుణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత “భగ”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలితాలను దక్షిణ దిశ మధ్య పశ్చిమ దిశా అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఈ నక్షత్ర జాతకులు కళాకారులను, కవులను, సంగీత కారులను, నటులను, మిత్ర వర్గాన్ని సదా గౌరవించాలి.
౨. వీరు తేనే ను దానం చేయాలి. ప్రధానంగా శుక్ర వారం నాడు తేనే దానం చేయుట వీరికి శుభము
౩. ఇంటి యందు తూర్పు ముఖంగా నటరాజ విగ్రహాన్ని పెట్టుకోవాలి
౪. సుగంధ ద్రవ్యాలు, అగర, చందనము, మసాలా దినుసులను సద్బ్రాహ్మణు లకు దానం చేయాలి.
౫. ఇంటి యందు “కస్తూరి” ఉంచుకోవాలి. మరియు కస్తూరి ని దానం చేయాలి.

ఉత్తరాఫల్గుణి (ఉత్తర):
ఉత్తరా ఫల్గుణి ప్రథమ చరణము సింహ రాశి యందును మరియు మిగిలిన 3 చరణాలు కన్యా రాశి యందును ఉంటాయి. టే, టో, ప, పి అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామాలు గల వారు మరియు వ్యవహార నామాలు గల వారందరూ ఉత్తరా ఫల్గుణి నక్షత్రమునకు చెందిన వారే. వీరు మనుష్య గణమునకు చెందిన వారు. ఉత్తరా ఫల్గుణి నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత “అర్యముడు”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరికి శ్రీ సూర్యారాధన అత్యంత శుభ ఫలాలను ఇస్తుంది.
౨. బ్రాహ్మణులు తప్పని సరిగా సంధ్యా వందనము ఆచరించుట, సూర్యునికి అర్ఘ్య ప్రధానము చేయుట.
౩. బ్రాహ్మణులు కాని వారు రాగి పాత్రలో జలాన్ని సూర్యునికి అభిముఖముగా నిలబడి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం వదలాలి.
౪. కుల దైవాన్ని మరియు ఇష్టదైవాన్ని తప్పని సరిగా పూజించుకోవాలి.
౫. ప్రతి ఆదివారం నాడు గోధుమలు, ఆవు నెయ్యి మరియు బెల్లం తో చేసిన పాయసం సూర్య భగవానునికి నివేదన చేసి స్వీకరించాలి.
౬. గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము, ఆవు నెయ్యి, రాగి పాత్రలను శివాలయాలకు దానం చేయాలి. ఇట్టి వస్తువులను సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౭. వీరు రాగి కడియాన్ని దక్షిణ హస్తమునకు ధరించాలి.
౮. ఉత్తములకు చక్కని నాణ్యమైన లేదా నాణ్యత గల ధాన్యమును దానం చేసుకోవాలి. వారి ఆశిస్సులను పొందాలి. ప్రధానంగా భానువారాలు ఇట్టి దానాలు చేసిన శుభ ఫలితాలు ఉంటాయి.

హస్త (హస్తమి):
హస్త నక్షత్ర నాలుగు చరణాలు కన్యా రాశి ఉంటాయి. పు, ష, ణ, ఠ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ హస్త నక్షత్ర కన్యా రాశికి చెందిన వారే. వీరు దేవ గణమునకు చెందిన వారు. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు మరియు అధిష్టాన దేవత “సవితృ”. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరికి సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౨. వేద పండితులు, వేదాధ్యయనము చేయు వారి సాంగత్యము చేయాలి
౩. వ్యాపార వేత్తలతో స్నేహం చేయండి. వారిని గౌరవించండి. అవసరమైతే వారికి సహాయం చేయండి.
౪. వీలైనంత వరకు తెల్లని వస్త్రాలను ధరించాలి. వీరికి నలుపు మరియు నీలం రంగ వస్త్రాలు ప్రతికూల ఫలాలను ఇస్తాయి.
౫. ఇంటికి తూర్పు ఈశాన్య భాగంలో శ్రీ గణేశ వెండి విగ్రహాన్ని పశ్చిమ ముఖంలో ఉంచి ఇంట్లో నుండి బయటకు వెళ్ళునపుడు నమస్కరించుకోండి.
౬. వెండితో చేసిన శ్రీ గణేశ విగ్రహాన్ని వేద పండితులకు మరియు సద్బ్రాహ్మణుడికి దానం చేయండి.
౭. శ్రీ సరస్వతి దేవాలయం లో అమ్మవారికి తెల్లని వస్త్రాలను బహుకరించండి.
౮. తెలుపు రంగు వస్త్రాలను, తెల్లని ధాన్యాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేయండి.

చిత్త:
చిత్త నక్షత్రము రెండు పాదాలు కన్యా రాశి యందును మరియు మిగిలిన రెండు పాదాలు తులా రాశి యందును ఉంటాయి. ఇట్టి నక్షత్రమున జన్మించిన వారు రాక్షస గణమునకు చెందిన వారు. పె, పో, రా, రి అనే నక్షత్రాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహారము నామము గల వారందరూ చిత్త నక్షత్రమున జన్మించిన వారే. చిత్త నక్షత్ర ప్రథమ మరియు ద్వితీయ చరణములు కన్యా రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. చిత్త నక్షత్ర తృతీయ మరియు చతురత చరణములు తులా రాశి యందు జన్మించిన వారికి తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు మరియు అధిష్టాన దేవత “త్వష్ట” జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. బట్టల నేతగాళ్లకు సహాయాన్ని అందించుట
౨. నేత్ర దానం చేయుట
౩. నేత్ర సంబంధమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారికి సహాయాన్ని అందించుట
౪. నేత్ర వైద్యులను గౌరవించుట
౫. హస్త కళలు, డిజైన్ వేయు వారు, వడ్రంగి మరియు కంసాలి పని చేయువారికి చేయూతనందించుట
౬. పలు విధాలైన సుగంధ ద్రవ్యాలను ఎర్రని వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం చేయుట

స్వాతి:
స్వాతి నక్షత్ర నాలుగు చరణాలు కూడా తులా రాశియందే ఉంటాయి. రు, రే, రో, త అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహారము నామము గల వారందరూ కూడా స్వాతి నక్షత్ర తులా రాశికి చెందిన వారే. వీరు దేవగణము నకు చెందిన వారు. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత “వాయు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. గుర్రపు నాడ ఇంటికి నైఋతి భాగంలో వేలాడదీయాలి.
౨. గుర్రాలు, పశువులు, పక్షులు మొదలగు వాటి గ్రాసము మరియు దాన కొరకు ఆర్ధిక సహాయమును అందించుట.
౩. గోగ్రాసము నకు ఆర్ధిక సహాయమును అందించుట.
౪. నిరంతరం దైవ ధ్యానం లో గడిపే వారికి, యోగులకు, దేవాలయాలయందు నిత్యార్చన చేసే ఉత్తములైన మరియు సద్గుణ సంపన్నులైన అర్చకులకు రెండు సేర్ల లేదా రెండు కిలోల శనగ పప్పును దానం చేయుట.
౫. ఉత్తములైన బ్రాహ్మణులకు విసనకర్రలను – వింజామర లను (ఇప్పటి కాలానికి అనుగుణంగా ఫ్యాన్) దానం చేయుట

విశాఖ:
విశాఖ నక్షత్రము 3 పాదాలు తులా రాశి యందును మరియు చతుర్థ చరణము వృశ్చిక రాశి యందును ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. తీ, తు, తే, తో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము లేదా వ్యవహార నామము గల వారందరూ విశాఖ నక్షత్ర జాతకులే. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి మరియు అధిష్టాన దేవత ఇంద్ర/అగ్ని. విశాఖ నక్షత్ర మొదటి మూడు చరణాలు తులా రాశి యందు ఉండుట వలన ఇట్టి నక్షత్ర జాతకులకు తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. మరియు విశాఖ చతుర్థ చరణము వృశ్చిక రాశి యందుండుట వలన తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలాలను, దక్షిణ దిశా మధ్య ఫలాలను, పశ్చిమము అధమ ఫలాలను ప్రసాదించును. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. మీ కంటే వయస్సులో గాని లేదా స్థాయిలో గాని తక్కువ అయిన వారిని అగౌరవ పరచరాదు.
౨. విద్యాధికులను గౌరవించండి మరియు వారి ఆశిస్సులు పొందండి.
౩. ఇట్టి నక్షత్ర జాతకులు వీలైనంత వరకు ఆగ్నేయ భాగం లో వంట గది గల ఇళ్లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
౪. యజ్ఞ యాగాదులందు యజ్ఞ నారాయణుడి తీర్థ ప్రసాదములు మరియు అట్టి యజ్ఞాన్ని నిర్వహించు ఋత్విక్కుల ఆశిస్సులు పొందాలి.
౫. ఇంటికి ఉత్తర భాగంలో ఎర్రని పూలు పూసే చెట్లను పెంచాలి (ఎర్ర మందార, ఎర్ర గులాబి, కాంచనం మరియు గన్నేరు మొదలగునవి).
౬. శనగలు మరియు పెసళ్ళు బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౭. శ్రీ సద్గురు సాయినాధుని మరియు శ్రీపాద శ్రీ వల్లభుడి ఆరాధన చేయాలి.

అనూరాధ:
అనూరాధ నక్షత్ర 4 చరణాలు కూడా వృశ్చిక రాశి యందు ఉంటాయి. న, ని, ను, నే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా అనూరాధ నక్షత్ర వృశ్చిక రాశికి చెందిన వారే. వీరు దేవ గణమునకు చెందిన వారు. ఇట్టి నక్షత్రమున జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలాలను, దక్షిణ దిశ మధ్యమ ఫలాలను, పశ్చిమము అధమ ఫలాలను ప్రసాదించును. అనూరాధ నక్షత్రానికి అధిపతి శని మరియు అధిష్టాన దేవత “మిత్ర”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరు చక్కని గోష్టి మరియు సత్సంగాలందు పాల్గొనాలి.
౨. ఉత్తములు మరియు జ్ఞానులతో మిత్రుత్వాన్ని చేయాలి
౩. వీరు ఎట్టి పరిస్థితిలో మిత్ర ద్రోహము చేయరాదు.
౪. ఉన్ని మరియు చర్మం తో చేసిన వస్తువులను దానం చేయాలి.
౫. శ్రీ మహావిష్ణు ఆరాధన శుభ ఫలాలను ఇస్తుంది
౬. స్వచ్చమైన నెయ్యి, ఖర్జూరాలు, బెల్లం, కొబ్బరి మరియు బియ్యం పిండి తో చేసిన తీపి పదార్థాలను దానం చేయాలి. ఇట్టి దానాన్ని సద్బ్రాహ్మణుడికి గాని మిత్రులకు గాని ఇవ్వాలి.

జ్యేష్ఠ:
జ్యేష్ఠ నక్షత్ర నాలుగు చరణాలు వృశ్చిక రాశియందే ఉంటాయి. నో, యా, యి, యూ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా జ్యేష్ఠ నక్షత్ర వృశ్చిక రాశికి చెందిన వారే. వీరు రాక్షస గణమునకు చెందిన వారు. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు, ఉత్తర దిశలు శుభ ఫలితాలను, దక్షిణ మరియు పశ్చిమ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత “ఇంద్రుడు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఇట్టి నక్షత్ర జాతకులు తమకంటే పెద్ద వారిని ఎల్లప్పుడూ గౌరవించాలి.
౨. చోరులు మరియు చొర ప్రవృత్తి గల వారిని పట్టించుటలో సహకరించాలి
౩. యుద్ద వీరులను మరియు సైన్యాన్ని గౌరవించాలి. వారికి సదా సేవలను అందించాలి.
౪. పెసర్లు, శర్కర మరియు మంచి నెయ్యి తో చేసిన పూర్ణం శ్రీ మహావిష్ణుకు నివేదన చేసి స్వీకరించాలి.
౫. శ్రీ విష్ణు దేవాలయాలకు తరచూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి
౬. శ్రీ మహావిష్ణు దేవాలయాలయందు పెసర్లు దానం చేయాలి
౭. ఒక కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి గాని లేదా రక్షక భటులకు గాని దానం చేయాలి.
౮. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం శుభ ఫలాలను ఇస్తుంది
౯. శ్రీ వైష్ణవ పీఠాధిపతుల సందర్శన మరియు వారి ఆశిస్సులను పొందాలి.

మూల:
మూల నక్షత్ర నాలుగు చరణాలు ధనుస్సు రాశిలో ఉంటాయి. యే, యో, బ. బి అను అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారందరూ మూల నక్షత్ర ధనుస్సు రాశికి చెందిన వారే. మూలా నక్షత్రములో జన్మించిన వారు రాక్షస గణమునకు చెందిన వారు. మూల నక్షత్ర జాతకులకు తూర్పు మరియు ఉత్తర దిశలు అత్యంత శుభప్రదముగాను, దక్షిణ మరియు పశ్చిమ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరియు అధిష్టాన దేవత “రాక్షస”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. గృహము నందు ఓషధులను పెంచాలి.
౨. రైతులకు మేలురకం విత్తనాలను దానం చేయాలి
౩. ఔషధ తత్త్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౪. పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలలకు చేయూతనందించాలి.
౫. కుమారి లేదా Aloe Vera లేదా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య భాగంలో పెంచాలి.
౬. మంగళ వారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషది మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్త్వం గల పుష్పాలను జలం లో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి.

పూర్వాషాఢ:
పూర్వాషాఢ నక్షత్ర 4 చరణాలు కూడా ధనుస్సు రాశి యందే ఉంటాయి. బూ, ధ, భా, ఢ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ పూర్వాషాఢ నక్షత్ర ధనుస్సు రాశి కి చెందిన వారే. వీరు మనుష్య గణమునకు చెందిన వారు, వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు అత్యంత శుభప్రదముగాను మరియు పశ్చిమ దక్షిణ దిశలు మధ్యమ ఫలితాలను ఇస్తాయి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత “ఆప”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామమునకు తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి. తూర్పు దిశలో దేవాలయము లేనట్లయితే గ్రామములో గల ఏదేని ఒక దేవాలయంలో బహుకరించాలి.
౨. ప్రతి గురు మరియు శుక్ర వారాలలో చేపలకు ఆహారం వేయాలి.
౩. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలి వేయాలి
౪. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్ర వారం నాడు దానం చేయాలి
౫. దేవాలయాలకు అగరువత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబి జలము, మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొని ఇవ్వాలి.
౬. జాలరులు – చేపలు పట్టే వారు కష్టాలలో ఉన్నట్లైతే వారిని ఆపన్నహస్తం అందించాలి.

ఉత్తరాషాఢ:
ఉత్తరాషాఢ ప్రథమ చరణము ధనుస్సు నందును మరియు మిగిలిన మూడు చరణాలు మకర రాశి యందును ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. బే, బో, జా, జి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులే. ఉత్తరాషాఢ ప్రధమ చరణమున ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. ఉత్తరాషాఢ ద్వితీయ, తృతీయ మరియు చతుర్థ చరణము మకర రాశి యందు జన్మించిన వారికీ తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత “విశ్వదేవ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమకూర్చాలి
౨. ఏనుగు మరియు గుర్రపు బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండే లాగ అమర్చాలి లేదా తగిలించాలి
౩. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభ ఫలాలను ఇస్తుంది
౪. వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్ళు పోయాలి
౫. ఏనుగులకు అరటి పండ్లను తినిపించాలి
౬. గోధుమలు, బెల్లం, మంచినేయ్యి తో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి

శ్రవణము:
శ్రవణా నక్షత్ర నాలుగు చరణాలు మకర రాశి యందు ఉంటాయి. జు, జే, జో, ఖ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము మరియు వ్యవహార నామము కల వారందరూ శ్రావణ నక్షత్ర మకర రాశికి చెందిన వారు. వీరు దేవా గణమునకు చెందిన వారు. శ్రావణ నక్షత్ర మకర రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. శ్రవణా నక్షత్రమునకు అధిపతి చంద్రుడు మరియు అధిష్టాన దేవత “విష్ణు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరు విష్ణు మూర్తిని మరియు విష్ణు భక్తులను గౌరవించాలి.
౨. వీరు గృహము నందు ఔషధ గుణములు గల మొక్కలను పెంచాలి.
౩. వీరు అహింస ను ఎత్తి పరిస్థితి లో ప్రోత్సహించ రాదు.
౪. సాధ్యమైనంత వరకు శాకాహార భోజనం చేయాలి
౫. సర్వ భూతములందు దయను కలిగి ఉండాలి. ఈర్ష్య అసూయలకు దూరంగా ఉండాలి.
౬. బకుల, జుహీ లేదా మల్లెలు, కదంబ పుష్పము, సంపంగి, అశోక, చంప అనబడే పుష్పాలు అన్ని గాని లేదా ఏవేని కొన్ని గాని శ్రీ విష్ణు దేవాలయాలకు బహుకరించండి. ఇట్టి పుష్పాల మొక్కలను ఇట్టి దేవాలయాలకు బహుకరించండి.
౭. శ్రీ మహా విష్ణు దేవాలయాలయందు మూల విరాటు విగ్రహానికి అలంకార సామాగ్రిని సమకూర్చండి.
౮. శ్రీ మహా విష్ణు దేవాలయాలను, శ్రీ వెంకటేశ్వర దేవాలయాలను, శ్రీ కృష్ణ మందిరాలను దర్శించాలి.

ధనిష్ఠ:
ధనిష్ఠ నక్షత్ర రెండు చరణాలు మకర రాశి యందును మరియు చివరి రెండు చరణాలు కుంభ రాశి యందును ఉంటాయి. గ, గి, గు, గే అనబడే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము లేదా వ్యవహార నామము గల వారు ధనిష్ఠ నక్షత్ర జాతకులు. ధనిష్ఠ నక్షత్రము రాక్షస గణమునకు చెందినది. ధనిష్ఠ నక్షత్ర ప్రథమ మరియు ద్వితీయ చరణములతో మకర రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. ధనిష్ఠ నక్షత్ర తృతీయ మరియు చతురత చరణము కుంభ రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి అంగారకుడు మరియు అధిష్టాన దేవత “వసు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరికి శ్రీ శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
౨. శివాలయాలయందు గోధుమలను సద్బ్రాహ్మణు లకు దానం చేయాలి
౩. కందులు మరియు కందిపప్పు లాంటి ధాన్యాన్ని దానం చేయాలి
౪. శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయాలయందు స్వామి వారి అభిషేకానికి కావలసిన సామాగ్రిని ఇవ్వాలి.
౫. స్త్రీలను ద్వేషించ రాదు. స్త్రీలను గౌరవించాలి.
౬. పాత మిత్రులను సదా గౌరవించాలి
౭. ధర్మ పరాయణత ను కలిగి ఉండాలి. అధర్మాన్ని ప్రోత్సహించ రాదు.

శతభిష (శతతార):
శతభిష నాలుగు చరణాలు కుంభ రాశి యందు ఉంటాయి. గో, స, సి, సు అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారు శతభిష నక్షత్ర కుంభ రాశికి చెందిన వారగుదురు. శతభిష నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. శతభిష నక్షత్ర కుంభ రాశి యందు జన్మించిన వారికీ తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత “వరుణ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. వీరు ఎల్లపుడూ పరిశుభ్రమైన దుస్తులను మాత్రమె ధరించాలి.
౨. నీటియందు తిరిగే చేపలు మరియు ఇతర జంతు రాశికి ఆహారాన్ని వేయాలి.
౩. వీరు సముద్ర వస్తువులను ఇతరులకు దానం చేయాలి
౪. స్వల్ప ప్రమాణంలో మద్యం ను నీటిలో ప్రవహింప చేయాలి.
౫. వీరు మాధ్యమును సేవించ రాదు (ఆ విషయానికి వస్తే మద్యం ఎవరు కూడా సేవించ రాదు)
౬. వీరు మినుములు మరియు నల్లని నువ్వులు శివాలయాలయందు దానం చేయాలి

పూర్వాభాద్ర:
పూర్వాభాద్ర మొదటి మూడు చరణాలు కుంభ రాశి యందును మరియు చివరి పాదము మీన రాశి యందును ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. సే, సో, ద, ది అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ పూర్వాభాద్ర నక్షత్రమునకు జన్మించిన వారు. పూర్వాభాద్ర మొదటి మూడు చరణము లందు జన్మించిన కుంభ రాశి వారికీ తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. పూర్వాభాద్ర చతుర్థ చరణము మీన రాశి యందు జన్మించిన వారికి ఉత్తర మరియు దక్షిణ దిశలు శుభ మరియు తూర్పు మరియు పశ్చిమ దిశలు మధ్యమ లేదా హీన ఫలాలను ఇస్తాయి. పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి బృహస్పతి మరియు అధిష్టాన దేవత “అజైకపాద”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఆవులను కాచే కాపరులకు కష్టాలలో ఉన్న వారికి చేయూతనందించాలి.
౨. గృహము నందు మామిడి చెట్టు పెంచాలి. పెంచే సౌకర్యము లేని పక్షంలో మామిడి చెట్టుకు నీళ్ళు పోయాలి.
౩. ఔషధీ మొక్కలను గృహము నందు పెంచాలి.
౪. ఆయుర్వేద వైద్యులను గౌరవించాలి. అవసరం అయినపుడు ఆయుర్వేద మందులను సేవించాలి.
౫. దొంగలను పట్టించుటలో సహకరించాలి
౬. ఒంటరిగా జీవించే సాదువులకు నెయ్యిని దానం చేయాలి.
౭. గ్రామానికి దూరంలో ఉన్న శివాలయాలయందు శివునికి చక్కని నాణ్యమైన గోఘ్రుతం తో అభిషేకం చేయాలి. ఇట్టి ఆవునేయ్యిని శివాలయాలకు దానం చేయాలి.
౮. వేద పండితులను సన్మానించాలి మరియు వారి ఆశిస్సులు పొందాలి.
౯. ఏక పాదులకు (కుంటి వారు) సేవ చేయాలి. ప్రధానంగా వారికి వైద్య సహాయాన్ని అందించాలి.

ఉత్తరాభాద్ర:
ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు చరణాలు మీన రాశిలో ఉంటాయి. దూ, శం, ఝూ, థ – అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము కల వారందరూ ఉత్తరాభాద్ర నక్షత్ర మీన రాశి జాతకులు. వీరు మనుష్య గణమునకు చెందిన వారు. ఈ నక్షత్రమున జన్మించిన వారికీ ఉత్తర దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు తూర్పు మరియు పశ్చిమ మధ్యమ ఫలాలను ఇస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు మరియు అధిష్టాన దేవత “ఆహిర్బుద్నియ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. ఇట్టి జాతకులు నిరంతరమూ దాన ధర్మాదులను ఆచరిస్తూ ఉండాలి.
౨. బ్రాహ్మణులు, ప్రధానంగా వృద్ధ బ్రాహ్మణులు, తపస్సు చేసుకునే వారి ఆశిస్సులు సదా పొందాలి.
౩. విలువైన ధాన్యము, పంచదార, బియ్యం మరియు పాలు మొదలగునవి బ్రాహ్మణులకు దానం చేయాలి.
౪. “అష్టౌ బ్రాహ్మణాన్” ఎనిమిది మంది బ్రాహ్మణులకు పాలతో చేసిన మిఠాయిలు, కోవా మొదలగునవి దానం చేయాలి.
౫. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాలయందు పాలతో చేసిన మిఠాయిలు మరియు కోవా మొదలగునవి స్వామి వారికి నివేదన చేయాలి.
౬. వృద్ధాశ్రమాలయందు ఉన్న వృద్ధులకు మంచి నాణ్యమైన విలువైన ధాన్యము, పంచదార, బియ్యం మరియు పాలు, వస్త్రాలను దానం చేయాలి. (ఇట్టి వస్తువు లందు ఏదేని ఒకటి కాని లేదా అన్నీ కాని చేయవచ్చు. యథాశక్తి.)

రేవతి:
రేవతి నక్షత్ర నాలుగు చరణాలు మీన రాశి యందు ఉంటాయి. దే, దో, చ, చి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ రేవతి నక్షత్ర మీన రాశికి చెందినా వారే. ఇట్టి నక్షత్ర జాతకులు దేవా గణమునకు చెందిన వారుల. ఈ నక్షత్రమున జన్మించిన వారికి ఉత్తర దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు తూర్పు మరియు పశ్చిమ మధ్యమ ఫలాలను ఇస్తాయి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత “పూషన్”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.
ఉపశమనాలు:
౧. “దక్షిణావర్తి శంఖాన్ని” శివ మరియు విష్ణు ఆలయాలకు బహుకరించాలి.
౨. వీరు గృహము నందు దక్షిణావర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి
౩. గ్రామము నందు గల శక్తి దేవాలయాలయందు శ్రేష్టమైన ముత్యాల హారాన్ని అమ్మవారి మూల విరాట్టుకు బహుకరించాలి.
౪. శంఖము, ముత్యాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౫. సువాసన గల పుష్పాలను మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక బుట్టతో సహా శివాలయంలో దానం చేయాలి.
౬. పలు రకాలైన సుగంధ పుష్పాలతో శ్రీ మహా విష్ణును పూజించాలి.
౭. ఉప్పు, పద్మాలు, పలు విధాలైన ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లు మరియు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానం చేయాలి.

నిత్య కర్మ – నైమిత్తిక కర్మ

మనం చేసే కర్మలలో రెండు రకాలుంటయి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ.

నిత్యకర్మకు ఫలితం ఉండదు. రోజూ స్నానం చేయడం, రోజూ సంధ్యావందనము చేయడం. వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు. చేయకపోతే దోశాలుంటాయి. రోజూ ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు.

నైమిత్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథినాదు చేసేటటువంటి పని. ఆ తిథినాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. ఉదాహరణకు దీపావళి పండుగనాడు తెల్లవారు ఝామున తలస్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినట్లే. ఎందుకంటే గంగ ఆ రోజున భూమండలంలో అన్ని నీళ్ళల్లోకి వస్తుంది. అందుకని *జలే గంగా*, *తైలే లక్ష్మీ* ఒంటికి నూనె రాసుకుంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆ రోజున. అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నైమిత్తిక తిథినాడు చేసే పనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి.

నిత్యం చేసే కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం. కాబట్టి నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు. నైమిత్తిక కర్మ పరమ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం.

ఇది నిత్యకర్మకీ, నైమిత్తిక కర్మకీ తేడా.

శుభంభూయాత్