దుప్పటి

నాకు నచ్చిన కాశీభొట్ల కామేశ్వర రావు గారి “దుప్పటి” కథ. పాతదే ఐనా మళ్ళీ మళ్ళీ చదివించే కథ.
దుప్పటి
కాశీభొట్ల కామేశ్వర రావు

ఈ చిన్న కథలో అరవై ఏళ్ల క్రిందటి కోనసీమ వాతావరణం, అక్కడి మనుషుల మధ్య సంబంధాలు, ఆకుపచ్చటి కొబ్బరి తోటలు, గలగల పారే కాలవలూ , పిల్లలు చదువుకునే బళ్లూ, వాళ్ళు తినే చిరుతిళ్ళు, గోదావరిపై ప్రయాణాలు….. అన్నీ ఎంచక్కా స్మృతిపథంలో తిరుగాడుతాయి. ఓసారి అందమైన బాల్యంలోకి మనసు మళ్ళిపోతుంది.
* * *
దుప్పటి
కాశీభొట్ల కామేశ్వర రావు

(శ్రీ కామేశ్వర రావుగారి స్వగ్రామం అమలాపురం తాలూకా ఇందుపల్లి. కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేసి, అమలాపురం పురపాలక సంఘ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేరు.
వీరు సాహిత్యం పట్ల చిన్ననాటి నుంచీ మంచి అభిరుచి కలిగినవారు. ఈయన అడపాదడపా ఓ డజను కథలుదాకా రాశారు కానీ, ఈ దుప్పటి మాత్రమే లభ్యమౌతోంది.)

ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉండేవి. అమలాపురంలో బస్సెక్కి, బొబ్బర్లంక రేవు దాటి ఆలమూరు మీదుగా వెళ్ళడం ఒకటి;
లేదా ముక్తేశ్వరం వచ్చి, రేవు దాటి కోటిపల్లి మీదుగా రాజమండ్రి చేరడం మరొకటి. (అప్పటికి రావులపాలెం వంతెన పడలేదు. అందువల్ల ఇవే మార్గాలు).
సాధారణంగా రాముడు ఎప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళినా ఆలమూరు మీదుగానే వెళ్ళేవాడు. అయితే ఈసారి ఆ బస్సు దాటిపోయింది. అంచేత తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసి వచ్చింది.
ముక్తేశ్వరం రేవులో బస్ దిగి, రేవు దాటడానికి లాంచీ టికెట్టు తీసుకుంటున్నాడు.

ఇంతలో “ఒరేయ్.. రావుడూ! ఒరేయ్ రావుడూ !” అంటూ పరిచిత కంఠం వినిపించింది.
అతను వెనక్కి తిరిగి చూశాడు. కుంటి సోమన్న! అవును కనిపించేది కుంటి సోమన్నే.
కుంటి సోమన్నది రావుడూ వాళ్ల ఊరే. రావుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు , వాళ్ల స్కూలు పక్కనే కుంటి సోమన్న పెసరట్ల కొట్టు ఉండేది. ఉదయం పూట పెసరట్లు, మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చ వెచ్చగా బడి పిల్లలకి దొరికేవి. ఏదయినా, ఒక కానీ ఖరీదు!
ఈ పిల్లలకి తోటల్లో దొరికే కొబ్బరిపళ్ళు (రాలిన ముదురు కొబ్బరికాయలు) పట్టుకెళ్ళి కుంటి సోమన్నకే అమ్మేవారు. అప్పుడు కొబ్బరిపండు ఖరీదు కూడా ఒక కానీయే. వీళ్ళు ఇలా కొబ్బరి పండిచ్చి అలా కొబ్బరి లౌజు తీసుకునే వారు.

సోమన్నకి ఆ కుంటితనం ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆ కారణంగా అతనికి పెళ్లి కాలేదు.
ఓ అంగవస్త్రం కట్టుకుని పెనం దగ్గర కూర్చునేవాడు. ఈ వ్యాపారంలో లాభం తియ్యాలనే ఆశ
కుంటి సోమన్నకి లేదు.
ఆ వీధిలోనే అతని అన్నదమ్ములున్నారు. రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు. కాకపోతే అతనికి నల్లమందు అలవాటొకటి ఉండడంవల్ల …..దానికి రోజూ ఓ అణా కావలసి వచ్చేది. ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజూ ఒక్క అణా మాత్రమే.
అప్పుడప్పుడు పిల్లల దగ్గర డబ్బులు లేనప్పుడు , వాళ్ళకి తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించే వాళ్ళు. కొందరి కుర్రాళ్ల ప్రయత్నం సఫలమయ్యేది కూడా. అయితే అది సోమన్న దృష్టిలో పడనే పడేది.
“వెర్రి వెధవల్లారా! కావాలని ఏడవకూడదూ? నేనే ఇద్దును కదా!” అంటూ మిగిలినవి తక్కిన కుర్రాళ్ళకి పంచిపెట్టేవాడు.

సోమన్న కొట్టు దగ్గరే కాలవ. ఈ కుర్రాళ్ళు ఆ కాలవలో ఈదేందుకు సోమన్న సాయం చేసేవాడు. కుంటివాడనే మాటే కానీ కాలువ ఈ మూలనుంచి ఆ మూలకి నాలుగు బారల్లో ఈదేసేవాడు. పిల్లలందరికీ చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు.
సోమన్న కొట్టు ఎదురుకుండా ఉన్న చింతచెట్టు కింద ఓపాక వేసి, రాముణ్ణి ప్రతిష్ఠించి , పిల్లలు భజన చేసేవారు. ప్రసాదాలు చేసి, పంచిపెట్టే బాధ్యత సోమన్న తీసుకునే వాడు. ఆ విధంగా రావుడితోపాటు పిల్లలందరి బాల్యజీవితంలోనూ సోమన్న ఓ భాగం అయిపోయాడు.!

ఆ సోమన్న రావుడికిప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనిపించాడు.
“ఇలాగ ఎక్కడికి పోతున్నావ్?” అన్నాడు.
“రాజమండ్రి…., ఉద్యోగం చేస్తున్నానక్కడ” అన్నాడు రావుడు.
“అబ్బో! పెద్దవాడవయ్యావురోయ్,” అన్నాడు సోమన్న ఆనందంగా.
“నువ్విక్కడున్నావేమిటీ ?” అంటూ , ఎదురుగా ఉన్న పెనం , పెసరట్ల పొయ్యి చూసి ‘నేను ఎంత తెలివి తక్కువగా అడిగేను’ అని అనుకున్నాడు రావుడు.
రోజులు మారిపోయాయనీ, తన పొట్ట తానే పోషించుకోవలసి వస్తోందనీ, ఓ రోజున పెనం, అట్లకాడా పుచ్చుకుని వాళ్ల ఊరునుంచి ఇక్కడకి వచ్చేసేననీ , ఇప్పుడిక్కడే ఉంటున్నాననీ చెప్పేడు సోమన్న. “పెసరట్టు కాల్చనా? ఇంకా నీకు లాంచికి అరగంట టైముంది.” అంటూ పెనం మీద రెండు పెసరట్లకి పిండి పోశాడు సోమన్న.

ఒకసారి మంట ఎగదోసి, “ఒరేయ్! విశ్వనాథంగాడు ఎక్కడున్నాడురా ఇప్పుడు?” అన్నాడు. విశ్వనాథం రావుడి చిన్ననాటి స్నేహితులలో ఒకడు. మంచి చురుగ్గా ఉండేవాడు.
“వాడిప్పుడు హైదరాబాదులో రైల్వేలో పనిచేస్తున్నాడు” అన్నాడు రావుడు.
“ఎప్పుడూ ఎవ్వరూ కనబడరురా” అన్నాడు సోమన్న పెసరట్టు మీద నెయ్యి పోస్తూ.
“ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకోసారి కనపడుతుందిరా. దాని అత్తారు కోటిపల్లే. ఇద్దరు పిల్లలు…. పలకరించి వెళ్తూంటుంది.” అంటూ పెసరట్లు ఆకులో వేసి అందించాడు సోమన్న.

రావుడి మనస్సు తన చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తోంది. ఇంతలో లాంచి హారను వినిపించింది. ఉలిక్కిపడ్డాడు రావుడు.
“ఫర్వాలేదులే….ఇంకా పావుగంట ఉంటుంది.” అన్నాడు సోమన్న. ఘుమఘుమలాడే పెసరట్లు రెండు తిని, ఓ అర్ధరూపాయి సోమన్న కివ్వబోయాడు రావుడు. సోమన్న తీసుకోలేదు.
“ఉంచు.” అన్నాడు రావుడు.
“వద్దు…. డబ్బెందుకురా నాకు?” అని క్షణం ఆగి, “ఒరేయ్ రావుడూ! చలికి మహా బాధపడుతున్నాను–ఈ గోదావరి వార. దుప్పటీ గుడ్డ ఏదైనా ఉంటే పడేద్దూ.” అన్నాడు సోమన్న. ఆ అడగడంలో యాచనా, దైన్యం ఏమీ లేదు. ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు.
రావుడి చేతిసంచీలో ఓ దుప్పటి ఉంది కూడా. కానీ అది ఒక వారంరోజుల కిందటే కొన్నాడు. దాని ఖరీదు పది రూపాయలు! అది ఇచ్చేద్దామా అని ఒక్కసారి రావుడికి అనిపించినా, అతని నాలుక మాత్రం యాంత్రికంగా, “ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే,” అంది.

రావుడు సంచీ పుచ్చుకువచ్చి లాంచీలో కూచున్నాడు. గోదావరి కెరటాల మీద లాంచీ ఉయ్యాలలూగుతూ పోతూ ఉంది. రావుడి మనసు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసలాడుతూ ఉంది. చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కరే జ్ఞాపకానికి రాసాగారు.
‘చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో ఉందిట. అప్పట్లో వాళ్ల తరగతిలో తనే పెద్దపిల్ల. ఆదిలక్ష్మి శుద్ధ మొద్దుపిల్ల. తన లెక్కలు చూసి చేసేసేది. మేష్టారితో చెప్తానంటే మొట్టికాయలు మొట్టేసేది. శ్యామలా, మంగాయీ అప్పచెల్లెళ్లు. ఇద్దరూ ఒకే క్లాసు. వాళ్ళింటిదగ్గర మెట్టతామర పువ్వులుండేవి. సుందరికి ఆ పువ్వులంటే ఎంతో ఇష్టం. తను కోసుకొచ్చి ఆమెకిస్తూండేవాడు. సుందరి ఇప్పుడెక్కడుందో? నలుగురు పిల్లల తల్లై ఉంటుంది.
వేసవి వెన్నెల రాత్రుల్లో తన స్నేహితులతో కలిసి, మావిడి చెట్టుకింద కూర్చుని దూరంనుంచి వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునే వాళ్ళం! గుయ్యంగాడూ, ఆంజనేయుడి వేషం వేసే ఆ సత్యంగాడూ– వీళ్ళందరూ ఇప్పుడెక్కడికి పోయారో? ఇంక మళ్ళీ జీవితంలో అలా ఆడుకోగలనా?’ కరిగిపోయిన కాలాన్ని గురించి ఆలోచిస్తోంది రావుడి మనస్సు.

ఆ మధుర స్మృతులన్నీ అతనిలో తట్టిలేపి, తీయని రోజుల్ని జ్ఞాపకానికి తెచ్చిన వాడు సోమన్న! దానికి కృతజ్ఞతగా సోమన్నకి తనేమిచ్చాడు? ఒక్క దుప్పటీగుడ్డ అడిగాడు. అది కూడా ఇవ్వలేని క్షుద్రుడ్నయ్యాను.
అలా ఆలోచిస్తూ ఒక్కసారి ఒడ్డువైపు చూశాడు రావుడు. సోమన్న ఉండే పాక చిన్నగా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ అందరూ సోమన్నని ఎరుగుదురు. లాంచీ దిగి, ఏ పడవ వాడికైనా దుప్పటీ ఇచ్చి పంపిద్దామనుకున్నాడు. కానీ ఆ కొత్త దుప్పటీ సోమన్నకివ్వక వాడే ఉంచేసుకుంటే??
ఇలా ఆలోచిస్తూన్న రావుడికి ‘సోమన్న సొమ్ము ఎవడూ అపహరించడులే’ అని మాత్రం అనిపించలేదు.

పడవ దిగి, బస్సెక్కేడు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామల ప్రదేశాలు కన్నులపండుగగా ఉన్నాయి. వాళ్ళ బడికి అవతలిపక్క అలాంటి చేలే ఉండేవి.
పెసర పైరు వేసినప్పుడు పిల్లలందరూ చేలోకి వెళ్ళి పెసర రొట్ట పీకి కాల్చుకుని తినేవాళ్ళు.
రావుడు ఊహాల్లో వుండగానే బస్సు రాజమండ్రి చేరింది. రాజమండ్రిలో దిగి, తనపనిలో తాను కూరుకుపోయినా, ఆ భావోన్మత్తత, అందుకు కారణమైన సోమన్నా రావుడి మనస్సును విడిచిపెట్టలేదు. మరునాటి మధ్యాహ్నానికిగానీ ఆ స్మృతులను మరచిపోలేకపోయాడు.

ఓ నెల గడిచింది. ఏదో పనిమీద రావుడికి అమలాపురం వెళ్ళవలసి వచ్చింది. ఈ సారి కోటిపల్లి మీదుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
తన చిన్ననాటి స్నేహితుడి కోరిక నెరవేర్చడానికి దుప్పటీ కొనాలని అనుకున్నాడు. దుకాణానికి వెళ్ళేడు. రావుడి దగ్గర పుష్కలంగా డబ్బుంది. కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో అతనిలో వచ్చేసింది. ఆరు రూపాయలిచ్చి ఓ దుప్పటీ కొన్నాడు.

ఉదయాన్నే బస్సెక్కి బయలుదేరేడు రావుడు. కోటిపల్లి చేరేసరికి తొమ్మిదైంది. లాంచీ గోదావరిలో సగం దూరం వచ్చేసరికి సోమన్న పాక కనపడుతోంది.
తనని చూసి సోమన్న పిలుస్తాడు. పిలవకపోయినా తనే పాకలోకి పోయి, రెండు నేతి పెసరట్లు కాల్పించుకుని తిని సోమన్నకి దుప్పటీ ఇవ్వాలి. రావుడు ఆలోచనలలో ఉండగా లాంచీ ఒడ్డుకు చేరింది.

అతను దిగి, సంచీ పుచ్చుకుని ముందుకు నడుస్తున్నాడు. సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు. అందులో సోమన్నకి అన్నగారైన వెంకటప్పయ్య ఒకడు.
“ఏమోయ్ , ఇల్లావచ్చావ్?” అన్నాడు రావుడు వెంకటప్పయ్యతో. కానీ వెంకటప్పయ్య ఏమీ బదులు చెప్పకుండా పాకలోకి వెళ్ళేడు. రావుడు కూడా వెనకాలే లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఒకడు అతని జబ్బ పట్టుకుని ఆపేడు. రావుడు పక్కకి తిరిగి, “సోమన్న?” అన్నాడు.
“సోవన్నగారు సచ్చిపోయారు. రేత్రి నాలుగు డోకులెళ్ళాయి,” అన్నాడు.
రావుడికి అంతా అర్థమైంది. అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వెంకటప్పయ్య సోమన్న శవాన్ని ఇవతలికి తెచ్చాడు. చాలా నీరసించి, పీక్కుపోయి ఉంది ఆకృతి. శవాన్ని గంపలో కూచోబెట్టి, “ఏదైనా గుడ్డ కప్పాలి,” అన్నాడు వెంకటప్పయ్య.

రావుడు తలవంచుకుని, తన సంచీలోంచి కొత్త దుప్పటి తీసి సోమన్నకి కప్పేడు. * * *

చక్కటి అనుభూతులను పంచుతూనే రచయిత ఈ కథలో మనిషిలో పిసినారితనం ఎంత లోతుగా ఉంటుంది..? దాని ప్రభావం ఎటువంటి పరిణామాలు కలుగచేస్తుంది అనే విషయాన్ని ఎంతో సహజంగా చిత్రీకరించారు. లోభం మనిషిలో ఒక సాధారణ బలహీనత అని రావుడి ద్వారా చెప్పేరు.

సోమన్న నిస్వార్థంగా, వయోభేదం లేకుండా పిల్లలతో మైత్రి నెరపినవాడు. ఈవాల్టికికూడా డబ్బులు తీసుకోకుండా పెసరట్టు నేతితో కాల్చి తినిపించినవాడు. రావుడిలో నిద్రాణమై ఉన్న గతకాలపు మధురానుభూతులను తట్టి లేపినవాడు.
కానీ, రావుడు?? ఒక్క దుప్పటీ గుడ్డ అడిగితే ఏదో కారణం చెప్పుకుని తప్పుకున్నాడు. ఇవ్వాలని లేక కాదు… అంత ఖరీదుది ఎందుకనే లోభగుణం. చివరికి తను కొనదలుచుకున్న ఖరీదులోనే కొన్నాడు….కానీ అది సోమన్న శవం మీద కప్పడానికే ఉపయోగపడింది కానీ బతికుండగా అతన్ని చలినుంచి కాపాడలేక పోయింది.

చెయ్యదలుచుకున్న పని….ముఖ్యంగా దాన ధర్మాల వంటివి వెంటనే తక్షణమే చేసేయాలి. లేకపోతే ఈ దిక్కుమాలిన మనసు మాయ చేస్తుంది. వేరే ఆలోచనలు వస్తాయి. వాటిని సమర్థించుకునే తర్కం పుట్టుకొస్తుంది. నువ్వు ఇవ్వదలుచుకున్నది వాయిదా వేస్తే, రేపు పుచ్చుకునేందుకు వాడు ఉండకపోవచ్చు….ఇచ్చేందుకు నువ్వూ లేకపోవచ్చు.

భార్య భర్తల బంధం

కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు… ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే!

1.నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు…ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం.
నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా!
తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో.తప్పకుండా తను కూడా మంచి గృహిణి గా,మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది.

2.నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో…
నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని..నీవు మమ్మల్ని,నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని ప్రేమగా ఉండాలి.

3.నీతో సమానంగా తనని చూసుకో…నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో!నీ మంచిచెడులో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది.

4. పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి…కాస్త మోహమటంగా ఉండచ్చు…నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యి.

5.నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి…
ప్రేమించడానికి వయస్సుతో పనిలేదు.చిన్న,చిన్న సర్ప్రైజ్ లు,కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో..వారాంతంలో బయటికి తీసుకుని వెళ్లు. పుట్టింటికి తనతో కలసి వెళ్ళు.
నీ లాంటి భర్త, మా లాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనం అందరం ప్రవర్తిద్దాం…

ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను…అనుభవిస్తున్నాను..నా అనుభవాలను నీతో చెపుతున్నాను…నువ్వు కూడా మీ నాన్నలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ,నువ్వు సంతోషంగా ఉంటూ…మమ్మల్ని సంతోషంగా ఉంచుతావని నమ్ముతున్నాను…నిండు నూరేళ్లు ఆనందంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను…ఇష్టకామ్య ర్థ సిద్ధి రస్తు….❤

మౌనమే నీ భాష ఓ మూగ మనసా…..

మౌనమే నీ భాష ఓ మూగ మనసా

తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు


చీకటి గుహ నీవు చింతల చెలి నీవు

నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో యెందుకు వగచేవో ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు

ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే

లేనిది కోరేవు యున్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా….

సహజంగా మనం పట్టించుకోని సోషల్ రూల్స్

 1. ఒకరికి, రెండు సార్లకు మించి
  అదేపనిగా కాల్ చేయవద్దు. వారు
  సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే
  చాలా ముఖ్యమైన పని ఉందని
  అర్థం.
 2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు
  అరువు తీసుకున్న డబ్బును వారికి
  తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న
  మొత్తమైనాసరే! అది మీ
  వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది!
 3. ఎవరైనా మీకోసం పార్టీ
  ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన
  వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్
  చేయవద్దు. వీలైతే మీ కోసం వారినే
  ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని
  అడగండి.
 4. “మీకు ఇంకా వివాహం కాలేదా?
  మీకు పిల్లలు లేరా?
  ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?”
  వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను
  ఎదుటివారిని అడగవద్దు. అవి,
  వారి సమస్యలు. మీవి కావు!
 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ
  మీరే తలుపు తెరిచి లోపలికి
  ఆహ్వానించండి. అమ్మాయి,
  అబ్బాయి, చిన్నా, పెద్దా ఎవరైనా
  సరే. ఒకరిక పట్ల మంచిగా
  ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా
  మారరు.
 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా
  మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు
  సరదాగా తీసుకోకపోతే వెంటనే
  దాన్ని ఆపివేయండి! మరలా
  చేయవద్దు.
 7. బహిరంగంగా ప్రశంసించండి,
  ప్రైవేటుగా విమర్శించండి.
 8. ఒకరి బరువు గురించి మీరు
  ఎప్పుడూ వ్యాఖ్యానించవద్దు.
  “మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు”
  అని చెప్పండి. అప్పుడు బరువు
  తగ్గడం గురించి మాట్లాడా
  లనుకుంటే, వారే మాట్లాడుతారు.
 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో
  చూపించినప్పుడు, అదొక్కటే
  చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు
  స్వైప్ చేయవద్దు. తర్వాత
  ఏముంటాయో మీకు తెలియదు
  కదా!
 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా
  వ్యవహరిస్తారో అదే గౌరవంతో
  క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.
  మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే
  ప్రజలు ఖచ్చితంగా దాన్ని
  గమనిస్తారు.
 11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ
  సలహా ఇవ్వకండి.
 12. సంబంధంలేని వారికి మీ
  ప్రణాళికల గురించి చెప్పవద్దు.
 13. ఒక స్నేహితుడు / సహోద్యోగి
  మీకు ఆహారాన్ని ఆఫర్
  చేసినప్పుడు మర్యాదగా ‘నో’
  చెప్పండి. కానీ, రుచి లేదా వాసన
  చూసిన తర్వాత ‘నో’ చెప్పవద్దు.
  అట్లా చేస్తే మీరు వారిని
  అవమానించినట్లే!
 14. మరో ముఖ్య విషయం! ఇతరుల
  విషయంలో అనవసరంగా జోక్యం
  చేసుకోకుండా, మీ పనేదో మీరు
  చూసుకోండి!!

నోట్: మీకు నచ్చితే ఆచరించండి!
లేకపోతే వదిలేయ్యండి!
అంతేగానీ ఏంటీ శ్రీ రంగనీతులు
అని మాత్రం అనుకోకండి!

ఆహార దోషాలు

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.
1. అర్ధ దోషం
2. నిమిత్త దోషం
3. స్ధాన దోషం
4. గుణ దోషం
5. సంస్కార దోషం.

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.

🔸 అర్ధ దోషం

ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది.

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.

వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.

శిష్యుడు తలవంచుకొని, “నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు.” అని తలవంచుకొన్నాడు.

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.

🔸 నిమిత్త దోషం

మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.

వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి.

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
‘అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.

నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం – బిందువులుగా బయటికి పోయి నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *’నిమిత్త దోషం ‘* ఏర్పడుతోంది.

🔸 స్ధాన దోషం

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.

దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, “విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు.

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి

🔸 గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

🔸సంస్కారదోషం

ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు

మన వివాహ బంధం

*అసలు పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం, ఇష్టం-అయిష్టం గురించి కాదు. కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరిలో ఒకరు ఐక్యమైపోయి తమని తాము ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి చదువుకున్న భర్త, భార్య రావాలనుకకోవడం కన్నా తమ మనసులను చదవగలిగిన భర్త, భార్య రావడం అనేది వారి అదృష్టం.*_ _*అలాంటి అందమైన మనసున్న వారిని పొందాలని కోరుకోవాలి గాని, బయటకు కనిపించే పైపై అందాలను చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులను మాత్రమే చూసి ఇల్లు కొనుక్కొన్నట్లు ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు "అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు" చూడాలని. అంటే బలమైన పునాదులు, గట్టి గోడలు, నునుపైన పూతలు ఉన్నాయా లేదా అని చూడాలి.. అంటే వారి వంశ పుట్టుపూర్వోత్తరాలు చూడాలి..*_ _**భార్య భర్తల బంధం ఏంత బలంగా ఉండాలంటే, భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. అలాగే భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. అంతేకాదు భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి తప్ప అయోమయం కాకూడదు.*_ _**ఒకరి మనసులోని భావాలను మరొకరు చెప్పకుండానే అర్థం చేసుకొనేలా ఉండాలి. అంటే ఒకరి మనసులోని ప్రేమను గాని బాధని గాని కళ్లలో చూసి, నోటితో చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు కదా.. అలా అర్థం చేసుకొనే భార్య భర్తలు దొరికితే అడుక్కు తినేవారు కూడా ఆనందంగా హాయిగా జీవిస్తారు..*_ _**భార్య భర్తల బంధం ఒక మధురానుభూతిగా మిగిలి పోవాలి. అంటే ప్రతి భర్త తన భార్యను తన తల్లికి ప్రతి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను తన మొదటి బిడ్డగా పరిగణిస్తే అంతకు మించిన మధురమైన బంధం మరొకటి లేదు కదా..*_ _**సంసారం అంటే భార్య భర్తలు కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ ఒకరికి ఒకరు వెన్నంటి ఉంటూ, తోడూ నీడగా ఒకరిని ఒకరు వీడకుండా ఉండడం..*_ _**ఏది ఏమైనా, భార్యాభర్తల మధ్య సంబంధం శాశ్వతంగా ఉండిపోవాలి. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. కానీ చివరి వరకు భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. ఇది ప్రతి భార్య భర్తలు గుర్తుంచుకోవాలి..*_ _**నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం నీకు లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు. అలాగే నీవెన్ని గొప్ప చదువులు చదివినా, ఏంత గొప్ప ఉద్యోగం చేస్తూ ఏంతో గొప్పగా సంపాదించినా భర్త అండదండలు లేకపోతే ఆ భార్య జీవితం నిరర్ధకమే..*_ _**ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడెమో కానీ, భార్యను బాగా అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అలాగే ఒక మంచి భార్య తన భర్త మనసెరిగి భర్త మదనపడకుండా, మనస్థాపానికి లోనుకాకుండా చూసుకొంటుంది.. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే కదా..*_ _*అలాకాకుండా ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తూ, మిడిసిపాటుతో అహంకారి అయిన భార్య దొరికితే అంబానీ లాంటి వారు కూడా సన్యాసంలో కలవాల్సిందే. అలాగే దురలవాట్లకు బానిసైన వ్యసనపరుడైన భర్త దొరికితే ఆ భార్య జీవితం నరకప్రాయం అయినట్లే..*_ _**ఒక మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉండాలనుకొంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తానే రాణిగా ఉంటుంది.*_ _**తమ కుటుంబంలో తమ మధ్య ఎన్ని కీచులాటలున్నా సమాజంలో తన భర్త పరువును నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే అందరిముందు భార్యను చులకనగా చూడకుండా తన భార్యను అందరి ముందు గౌరవించవలసిన ధర్మం భర్తకు ఉండాలి.*_ _**భార్య భర్తల బంధం ఎలా ఉండాలంటే "గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండేలాంటి గట్టి బంధమై ఉండాలి." అలాంటి బంధం దొరకడం ఒక గొప్ప వరం..*_ _**భార్య భర్తల స్మృతులు ఎలా ఉండాలంటే "నీ సంతోషం నేను కాకపోయినా, నా చిరునవ్వు మాత్రం నువ్వే అయ్యుండాలి, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే అయ్యుండాలి " అనే విధంగా ఉండాలి..*_ _**భార్య భర్తలు ఇరువురు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరి పనులలో ఒకరు సహాయం చేసుకుంటూ సేవ చేయడం అంటే ఒకరి కింద ఒకరు బానిసగా బ్రతుకుతున్నామని కాదు ఇక్కడ అర్థం, ఒకరి బంధాన్ని మరొకరు గౌరవిస్తున్నామని అర్థం..*_ _*నిజానికి భార్య భర్తల బంధం అన్నది ఒక అందమైన పుస్తకం లాంటిది. జీవితంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఆ పుస్తకంలోని అచ్చు తప్పుల వంటివి. అచ్చు తప్పులున్నాయని మంచి పుస్తకాన్ని పారెయ్యలేము కదా.. అలాగే చిన్న చిన్న పొరపాట్లు జరిగినంత మాత్రాన బంధాలను తెంచుకోకుండా, మరొకసారి అలాంటి పొరపాటు జరుగకుండా చూసుకొనే వారి బంధం శాశ్వతంగా నిలిచిపోతుంది..*_ _**నీ భార్య గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగం చేస్తూ గొప్పగా సంపాదించేదిగా ఉండక్కర్లేదు. జీవిత పాఠాలను చదివి ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగి, నీ వంశాభివృద్ధి కోసం నీకు ఇద్దరు ప్రతినిధులను అందించే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!..*_ _**అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ నీ జన్మకు అర్థం లేదు. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి మసులుకొనేదే "మాంగల్య బంధం" అంటే..*_ _**అటువంటి బంధాలు తెగిపోకుండా శాశ్వతంగా ఉండాలి అంటే, ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. ఒకవేళ మనం తప్పు చేస్తే క్షమించమని ఎదుటి వారిని క్షమాపణ అడగాలి. ఒకరిపైన ఒకరికి ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానులు ఉండాలి. ముఖ్యంగా ప్రేమ అనేది చాలా విలువైనది. అందుకే "మన బ్రాహ్మణ వివాహం"అనే గుడిలో ప్రేమ అనే విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకొన్నపుడే వివాహబంధం రాణిస్తుంది..*_

*ఈ సృష్టిలో భగవంతుడు తీర్చిదిద్దిన సుందరమైన అతి గొప్ప కళాఖండం మన “మన కుటుంబం”. ఆ కుటుంబం వ్యవస్థను అర్థం చేసుకొని అవగాహనతో జీవించుదాం శుభమస్తు…

మాట జారితే మనసు విరుగుతుంది !!

ఎవరైనా మీ మనసు మీద దెబ్బ కొట్టే మాటలు మాట్లాడితే మౌనంగా భరించండి కానీ మాటలు జారితే బంధాలు విచ్చిన్నం అవుతాయి…మాటకు అంత బలముంది! నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు…అదే మాట తీరు…ప్రతి రోజు ఎంతో మందితో మాట్లాడితే చాలా మందిలో పరిపక్వత తో కూడిన మాటలు కనబడవు! ఒకాయన తన ఆత్మస్తుతి వినిపిస్తే మరొకాయన తన ప్రొఫెషన్ డబ్బా కొట్టుకుంటాడు! చాలా మందిలో సెల్ఫ్ గోల ఎక్కువే! అయితే ప్రతి మాటను మనం పరిశీలిస్తే ఆయన మానసిక స్థితిని అంచనా వేయవచ్చు! కాకి – కోయిల నలుపే కానీ కాకి గోల అంటారు… కోకిల రాగం అంటారు మాట తీరు కూడా అంతే ఆచితూచి మాట్లాడే వారికి గౌరవం ఎక్కువ! సుత్తి కొట్టే వారిని వదిలించుకుందామని అనిపిస్తుంది! చాలా మంది తన గొప్ప తనం తనకు తాను చెప్పుకునే వారికన్నా ఆయన గురించి మరొకరు మంచిగా చెప్పిన వారికే గౌరవం ఉంటుంది! విచిత్రం ఏమిటంటే మానసిక శాస్త్రం అవపోసనం పట్టే వారికి ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటల్లో అబద్దాలు ఎన్నో ఇట్టే అర్థం అవుతాయి! కడుపులో నుండి మాట్లాడే వారే నిజాయితీగా ఉంటారు! ఆర్భాటాలు చెప్పే వారు ఎదుటివ్యక్తిలో లోకువ ఆవుతారు!ఇక కొంత మంది ఉంటారు

చిన్న మాటకే చివ్వుకున్న చిన్నబుచ్చుకుంటారు… ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మాట్లాడలేదో గ్రహించకుండా నోరు పారేసుకుంటారు.. అది జీవిత కాలం మనసులో నిక్షిప్తం అయ్యి ఆ మనిషిని చూస్తే ఆ మాటలే గుర్తుకు వస్తాయి! ఎదుటి వ్యక్తిని కించపరిచే మాటలు మాట్లాడితే ఆయనతో పనిబడ్డప్పుడు మీ ముఖం లో అంతరాత్మ ప్రవేశించి ఆ మాటలను గుర్తుకు తెస్తాయి! తండ్రి కొడుకుల బంధాలు,అత్తా కోడలు బంధాలు ఈ మాట తీరుతో విచ్చిన్నం ఆవుతాయి! మనవణ్ణి ఎత్తుకొని ముద్దాడుతున్న కూడా …కోడలు దెప్పి పొడిచే మాటలకు వాడిపై ఆపేక్షను పక్కన బెట్టి “నువ్వు కూడా మీ అమ్మ తీరే పోరా” అంటూ కోడలి మాటలను గుర్తుకు తెచ్చుకొని ఏడ్చే అత్తగార్లు ఉన్నట్టే నువ్వు మీ అమ్మ పోలికే అన్నన్ని మాటలు అని ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తారా అనే మొగుణ్ణి చీదరించుకునే కోడలు దెప్పి పొడుపులు చాలా కుటుంబాల్లో కనబడతాయి!మనిషి మాట్లాడే మాటల్లో

తిట్లూ, దీవెనలు, పొగడ్తలు, విమర్శలు కపట వాక్యాలు.. ఇలా ఎన్నెన్నో వినిపిస్తుంటాయి. అందులో సార్థకమైనవి కొన్నైతే నిరర్థకమైనవి ఎన్నో ఉంటాయి.మనిషి వ్యక్తిత్వం అతడి మాటల్లో తొంగి చూస్తుందంటారు పెద్దలు. అందుకే మంచి మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి. మనిషికి ఆరు రకాల బాషణాలు వన్నె తెస్తాయి..మిత భాషణం హిత భాషణం, స్మిత భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం!! అలా మాట్లాడటం నిజంగా ఒక కళ ! చాలా కొద్దిమంది ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు. ఎదుటి మనిషి నొచ్చుకోకుండా దేన్నయినా చక్కగా చెప్పగలుతారు. మనలో ఎన్నో ఉద్వేగాలలోంచి ఒక మాట బయటికి వస్తుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితిలోనూ చక్కగా మాట్లాడగలగటం ఒక నేర్పు. అందమైన భావవ్యక్తీకరణకు తగినంత అందమైన భాష తో మాట్లాడితే గౌరవం పెరుగుతుంది. మాట ఒక మలయ సమీరంలాగా ఉండాలి. ఒక సువాసనల మెత్తని పువ్వు లాగా అవతలి మనిషికి చేరాలి. మెత్తని ఈకతో గాయం పైన నవనీతం రాసినంత సున్నితంగా ఉండాలట! అంతేగానీ అది పుల్ల విరిచినట్లు.. అవతలి మనిషి మొహం తిరిగిపోయేంత నొప్పి తగిలినట్లు ఉండకూడదు. మాట తేనె కంటే మధురంగా ఉండాలి!!

వంటనూనెల్లో దాగిన విషం

@ జాగ్రత్త పడవలసిన విషయం #

సన్ ఫ్లవర్ 30-40 సంవత్సరాల క్రితం పండించే వారే కాదు అసలు మన భారతదేశంలో 40 సం” కిందట సన్ ఫ్లవర్ నూనె లేదు, పంట లేదు…,
మన ఆహారధాన్యం నూనె ధాన్యం కానే కాదు.
ఆరోగ్యానికి హానికరం

మన భారత దేశం లో తక్కువనే పండిస్తారు

మరి ప్రతి నెలా ఇన్ని లక్షల లీటర్ల సన్ ఫ్లవర్ నూనె ఎలా వస్తున్నది ??

సన్ ఫ్లవర్ నూనె పాకెట్ లో కేవలం 10-15% సన్ ఫ్లవర్ నూనె ఉంటుంది (అది కూడా ఆరోగ్యానికి హానికరం) మిగితా 60% ప్యరాఫీన్ ఆయల్

👉⛽క్రూడ్ లో నుండి డీజిల్, పెట్రోల్ తీసిన తరువాత నీరు లాంటి పారాఫిన్ (Paraffin) ఆయల్ బయటకు వస్తుంది దీనిని వంట నూనెలా ఉపయోగిస్తే హార్ట్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ , డయాబెటిస్ వ్యాధులు వస్తాయి. ఈ నూనె చాల ప్రమాదకరం🐽

మిగతా 30% శాతం పామాయల్ ఉంటాయి.
పాం ఆయల్ తినే నూనె కాదు హార్ట్ మరియు నరాల వ్యాధులు వస్తాయి.
పూర్వకాలం లో ఎవ్వరూ ఉపయోగించలేదు. అసలు 30 సం”ల క్రితం ఈ పామాయల్ ఉనికే లేదు !

ఈ కల్తీ నూనెలకు తోడు ప్లాస్టిక్ ప్యాకెట్లు….
ప్లాస్టిక్ లో BPA
(bisphenol A) ఇంకా pthalates అనే అతి విషకరమైన కెమికల్స్ నూనె లో కలుస్తాయి వీటి వలన మగవాళ్లలో వీర్యోత్పత్తి తగ్గిపోయి నపుంసకులుగా మారుతున్నారు..!

📵 దరిదాపుగా మార్కెట్ లో బ్రాండెడ్ నూనెలుగా మనం వాడుతున్నవేవీ మంచివి కావు.

కల్తీ నూనెలు నుంచి కాపాడుకునే మార్గాలు :-

👉వేరు శెనగలు, నువ్వులు కుసుమలు లాంటి నూనె ధాన్యాలు కొని ఆయిల్ మిల్ లో మన కళ్ల ముందే గానుగ పట్టించాలి.

👉నూనెను ప్లాస్టిక్ కంటైనర్ లో వేస్తే ప్లాస్టిక్ లో ఉన్న విష కెమికల్స్ నూనె లో కలిసి పోతాయి కాబట్టి నూనె నిల్వ చెయ్యడానికి స్టీల్ కంటైనరే వాడాలి.

👉ఇలా మనం సొంత నూనె వాడుకుంటే భారత దేశంలో 80-90% హార్ట్ వ్యాధులు దూరం అవుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలు దరికి రావు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం తగ్గుతుంది !!

మరి ఎలాంటి వంట నూనెలు వాడాలి

జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనే (Non Refined Oil). నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు, జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది . నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము, ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ (Refined) చేసినపుడు జిగురు, వాసన పోతాయి. ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే . ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది . మనము శుద్ధమైన నూనె (Non Refined Oil) తీసుకున్నప్పుడు మన శరీరంలో *లివర్* సహాయంతో మంచి కొలెస్ట్రాల్ (H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు. రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్, డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు. ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైండ్ అయిలో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు. వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె, పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి, కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనవి బెల్లం, తేనె.

కుస్తీపట్లు, దండీలు, బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది. రోగాలకు రాజు వాతరోగాలు.

మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పులు, హార్ట్ ఎటాక్, పక్షవాతము, బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి. జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు (Non -Refined) వేరు శెనగ నూనె , కొబ్బరి నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను. ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను (Sun flower seeds) గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి . మనకు ఏ మాత్రము ఈ Sun flower oil వాడదగినది కాదు, ఆరోగ్యకరము కాదు. ఈ రిఫైండ్ ఆయిల్స్ (Refined oils) ఎంత మాత్రమూ వాడతగినవి కాదు . సోయాబీన్స్, సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు. పందులు తినతగినవి ఈ సోయాబీన్స్, ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు . మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు. కావున వీటిని వాడరాదు. వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి. పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్. వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు. వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు. ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు. విదేశీయులకు భారత దేశము ఒక ప్రయోగశాలగా మారింది. కావున మనము మన సంపూర్ణ ఆరోగ్యము కొరకు త్యజించ వలెయును . *శుద్దమైన నూనెలను* వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు.

గమనిక :-
సన్ ఫ్లవర్ ఆయిల్ (Sun Flower Oil), సోయాబిన్ ఆయిల్ (Soya Bean Oil) , పామోలిన్ ఆయిల్ (Pamolene Oil) ఈ నూనెలు వాడరాదు.

షుగర్ అంటే ఏమిటి?!

మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు. “ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు.”

చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది

(1) – చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. బాణసంచా తయారీలో ఉపయోగించే మసాలా సల్ఫర్!

(2) – సల్ఫర్ చాలా భారీ రసాయన మూలకం. అది మానవ శరీరంలోకి వెళ్ళిన తర్వాత, దాన్ని బయటకు తీయడం అసాధ్యం అవుతుంది.

(3) – చక్కెర చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, దీనివల్ల గుండెపోటు వస్తుంది.

(4) – చక్కెర శరీర బరువును అధికంగా పెంచుతుంది, దీనివల్ల es బకాయం వస్తుంది.

(5) – చక్కెర రక్తపోటును పెంచుతుంది.

(6) – మెదడు దాడికి చక్కెర ప్రధాన కారణమని నిరూపించబడింది.

(7) – ఆధునిక వైద్య శాస్త్రం చక్కెరలో తీపి రుచిని సుక్రోజ్‌గా గుర్తిస్తుంది. సుక్రోజ్ మానవులకు మరియు జంతువులకు జీర్ణించుకోవడం కష్టం.

(8) – చక్కెర తయారీ ప్రక్రియలో ఇరవై మూడు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు.

(9) – డయాబెటిస్‌కు ప్రధాన కారణం చక్కెర.

(10) – కడుపు పుండుకు చక్కెర ప్రధాన కారణం.

(11) – శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదల చక్కెర వల్ల వస్తుంది.

(12) – పక్షవాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం.

(13) సాధ్యమైనంతవరకు, చక్కెరను వదిలివేసి, స్వచ్ఛమైన బెల్లం తినడం ప్రారంభించండి.

పంచదార తినకండి ప్రాణం మీదకు తెచ్చుకోకండి

నువ్వుల నూనె

ఈ భూమిపై లభించే ఉత్తమమైన ఆహారాల గురించి మాట్లాడుకుంటే, అప్పుడు *నువ్వుల నూనె* పేరు ఖచ్చితంగా వస్తుంది.

మరియు ఈ ఉత్తమ పదార్థం మార్కెట్లో అందుబాటులో లేదు. రాబోయే తరాలకు దాని గుణాలు కూడా తెలియదు. ఎందుకంటే ఈ కొత్త తరం జనం, టీవీ వాణిజ్య ప్రకటనలను చూసిన తర్వాత మాత్రమే అన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. మరియు కంపెనీలు నువ్వుల నూనెను ప్రోత్సహించవు.

ఎందుకంటే దాని లక్షణాలను తెలుసుకున్న తరువాత, మీరు ఆ కంపెనీల నూనె అని పిలువబడే ద్రవ కందెన(కొవ్వు)ను తీసుకోవడం మానేస్తారు. _*నువ్వుల నూనెను నూనెలకు నూనె అంటారు.*_ నువ్వుల నూనెకు చాలా బలం ఉంది, అది రాయిని కూడా చీల్చుతుంది.

మీరు ప్రయత్నించండి. ఒక కొండ రాయిని తీసుకొని ఒక గిన్నెలాగ తయారు చేసి, ప్రపంచంలో నీరు, పాలు, ఆమ్లం లేదా ఆమ్లం ఉంచండి, ప్రపంచంలో ఏదైనా రసాయన, ఆమ్లం, అదే రాయిలో అలాగే ఉంటుంది.

కానీ… మీరు ఆ గిన్నెలో నువ్వుల నూనెను, ఆ గొయ్యిలో నింపండి .. 2 రోజుల తరువాత మీరు చూస్తే, నువ్వుల నూనె… రాయిలోకి ప్రవేశించి రాయి కిందకు వస్తుంది.

ఇది నువ్వుల నూనె యొక్క బలం. ఈ నూనెతో మసాజ్ చేయడం వలన, అది ఎముకలను దాటి, ఆ ఎముకలను బలపరుస్తుంది. నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నువ్వుల నూనెను ఏదైనా గానుగ నుండి కొనండి. తైలం అనే పదం "తిల్" అనే పదం నుండి వచ్చింది. అంటే, నూనె యొక్క నిజమైన అర్ధం "నువ్వుల నూనె" అని అర్థం. నువ్వుల నూనె యొక్క గొప్ప గుణం ఏమిటంటే, ఇది శరీరానికి ఎంతో శుభప్రదంగా పనిచేస్తుంది ..

మీకు ఏ వ్యాధి ఉన్నా, దానికి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది. ఈ గుణము ఈ భూమి మీద ఇతర ఆహార పదార్థాలలోను కనుగొనబడలేదు. 100 గ్రాముల తెల్ల నువ్వులలో, 1000 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. నువ్వులు, బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. నలుపు మరియు ఎరుపు నువ్వులు, ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి, ఇది రక్త లోపానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది. నువ్వుల నూనెలో ఉన్న లెసిథిన్ అనే రసాయనం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. నువ్వుల నూనెలో సహజంగా , సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా చాలా త్వరగా క్షీణించటానికి అనుమతించదు. *ఆయుర్వేద చరక సంహిత లో, వంట చేయడానికి ఇది ఉత్తమమైన నూనెగా పరిగణించబడనది.* నువ్వుల నూనెలో, విటమిన్-C మినహా అన్ని అవసరమైన పోషక పదార్థాలు ఉన్నాయి, ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. నువ్వులు విటమిన్ -బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇది మీథోనిన్ మరియు ట్రిప్టోఫాన్ అని పిలువబడే రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది, ఇవి పప్పు దినుసులు, వేరుశెనగ, బీన్స్, చోలాస్ మరియు సోయాబీన్స్ వంటి చాలా శాఖాహార ఆహారాలలో కనిపించవు. ట్రిప్టోఫాన్‌ను ప్రశాంతమైన పదార్థం అని కూడా పిలుస్తారు, ఇది గాఢ నిద్రను కలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెథోనిన్ కాలేయాన్ని సరిచేస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. టిల్బీస్ జీవక్రియను పెంచే ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క పెద్ద మూలం. ఇది మలబద్దకాన్ని కూడా అనుమతించదు. నువ్వు గింజల్లో ఉండే పోషక అంశాలు కాల్షియం, ఐరన్ వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. నువ్వుల నూనెలో తక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది, కాబట్టి దీని నుండి తయారైన ఆహారాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ అర్ధం ఏమిటంటే, మీరు సేకరించిన స్వచ్ఛమైన నువ్వుల నూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. అనారోగ్యంతో లేనప్పుడు, చికిత్స అవసరం ఉండదు. ఇది ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, సరైన ఆహారమే మాత్రమే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అపుడు శరీరానికి చికిత్స అవసరం ఉండదు. కొంతమంది ప్రజలు మార్కెట్లో నువ్వుల నూనె పేరిట మరికొన్ని నూనెలను విక్రయిస్తున్నారని గుర్తుంచుకోవాలి .. ఇది గుర్తించడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీ ముందు తీసిన నూనెను మాత్రమే నమ్మండి. ఈ పని కొంచెం కష్టం, కానీ మొదటిసారి చేసిన ప్రయత్నంగా, ఈ స్వచ్ఛమైన నూనె మీకు అందుబాటులో ఉంటుంది. ఈ నువ్వుల నూనెలో మోనో-అసంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) అందించటం ద్వారా శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బులు, గుండెపోటు మరియు అథెరోస్క్లెరోసిస్ అవకాశాలను తగ్గిస్తుంది.

క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది : నువ్వులు సెసామిన్ అనే యాంటీఆక్సిడెంట్ కలిగివుంటాయి, ఇది క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపుతుంది మరియు దాని మనుగడ రసాయన ఉత్పత్తిని ఆపడానికి సహాయపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, (Lung cancer), కడుపు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రభావాలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో నియాసిన్ అనే విటమిన్ ఉంటుంది, ఇది ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో సహాయ పడుతుంది.

గుండె కండరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. ఈ నూనెలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇది గుండె కండరాలు సజావుగా పనిచేయడానికి సహాయ పడుతుంది మరియు క్రమమైన వ్యవధిలో గుండె కొట్టుకోవడానికి సహాయపడుతుంది.

శిశువుల ఎముకలను బలపరుస్తుంది. నువ్వులు ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇది పిల్లల ఎముకల పెరుగుదలను బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది. ఉదాహరణకు, 100 గ్రాముల నువ్వులు 18 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి, ఇది పిల్లల అభివృద్ధికి చాలా ముఖ్యమైనది.

గర్భిణీ స్త్రీ మరియు పిండం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

నువ్వుల లో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీ మరియు పిండం యొక్క అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడుతుంది.

నువ్వుల నూనె శిశువులకు మసాజ్‌ చేయడానికి పని చేస్తుంది. అధ్యయనం ప్రకారం, నువ్వుల నూనెతో శిశువులకు మసాజ్ చేయడం వల్ల వారి కండరాల బలానికి, వాటి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఈ నూనెతో మసాజ్ చేయడం ద్వారా, పిల్లలు హాయిగా నిద్రపోతారు.

బోలు ఎముకల వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది. నువ్వుల నూనెలో జింక్ మరియు కాల్షియం ఉన్నాయి, ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్ మందులను సమర్థవంతంగా పని చేయిస్తుంది. తమిళనాడులోని వినాయకా మిషన్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ అధ్యయనం ప్రకారం, ఇది అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని 36% తగ్గిస్తుంది. యాంటీ-డయాబెటిక్ ఔషధం, గ్లిబెన్క్లామైడ్తో కలిపినప్పుడు సహాయపడుతుంది. అందువల్ల, టైప్ 2 డయాబెటిక్ రోగికి ఇది సహాయపడుతుంది. నువ్వులు, పాలతో పోలిస్తే మూడు రెట్లు కాల్షియం కలిగి ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ బి మరియు ఇ, ఐరన్ మరియు జింక్, ప్రోటీన్ మరియు కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి పాలల్లో లేవు. నువ్వుల నూనె, చాలా సంవత్సరాలు పాడవదు, వేసవి రోజులలో కూడా అదే విధంగా ఉంటుంది.

నువ్వుల నూనె సాధారణ నూనె కాదు. ఈ నూనెతో మసాజ్ చేస్తే, శరీరం గొప్ప ఉపశమనం పొందుతుంది. పక్షవాతం వంటి వ్యాధులను కూడా నయం చేసే సామర్థ్యం దీనికి ఉంది.

దీనితో, మహిళలు తమ రొమ్ముల కింది నుండి పైకి మసాజ్ చేస్తే, అప్పుడు రొమ్ములు బలపడతాయి. శీతాకాలంలో మీరు ఈ నూనెతో శరీరానికి మసాజ్ చేస్తే, జలుబు అనిపించదు.

నువ్వుల నూనెతో ముఖానికి మసాజ్ చేస్తే, ముఖం యొక్క అందం మరియు మృదుత్వాన్ని కాపాడుతుంది.
పొడిగా ఉన్న చర్మానికి ఇది ఉపయోగపడుతుంది. నువ్వుల నూనెలో, విటమిన్ A మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి. ఈ కారణంగా, ఈ నూనెకు ఇంత ప్రాముఖ్యత ఉంది. ఈ నూనెను వేడి చేసి చర్మంపై మసాజ్ చేయడం వల్ల, చర్మము నిగారింపు పొందుతుంది.

జుట్టు మీద పూస్తే, వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.

మీకు కీళ్ల నొప్పులు ఉంటే, నువ్వుల నూనెలో కొద్దిగా శొంఠి పొడి, చిటికెడు ఇంగువ పౌడర్ వేసి వేడి చేసి మసాజ్ చేయండి. నువ్వుల నూనె ఆహారంలో సమానంగా పోషకమైనది. మను ధర్మం లో కూడా నువ్వులు లేకుండా ఏ కార్యము సిద్దించదు, పుట్టుక, మరణం, పరానా, యజ్ఞం, శ్లోకం, తప, పిత్ర, పూజ మొదలైనవి నువ్వులు లేకుండా ఉన్నట్లు రుజువు లేదు. నువ్వులు మరియు నువ్వుల నూనె లేకుండా ఇది సాధ్యం కాదు, కాబట్టి ఈ భూమి యొక్క అమృతాన్ని అవలంబించి జీవితాన్ని ఆరోగ్యంగా చేసుకోండి. చాలా ఉపయోగకరమైన విషయం.

సర్వేజనాఃసుఖినోభవంతు