కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు

అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతుంది దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు. కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు:

1.అతి తెలివి
2.చిన్న తప్పును కూడా భరించే శక్తి, సహనం లేవు.
3.అందరూ సమానమే అనే వింత భావన పెరగటం.
4.పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక పోవడం.
5.ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లోని వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.
6.చిన్నదానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.
7.ఎవరో ఒకరి నోటి దురుసుతనం కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణం అవుతుంది.
8.ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం.
9.ఇంట్లో భార్యా భర్తలు, తల్లి దండ్రులు చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు. అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది. అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత 30, 40 ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు.
10.ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు,పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండాపోతుంది.
11.మనుష్యులు అంటేనే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ లాలస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.
12.మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.
13.కుటుంబ నిర్వహణ ఒక కళ. ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.
14.మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను నాభార్య/భర్త అనే సిద్దాంతం పోయి “నేనే నేను” “నేను నేనే”పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచుకోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు. కుటుంబ విలువలు, కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి. అన్నాదమ్ములు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ, భార్యాభర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనేలేవు. సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో. ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు.
15 డిజిటల్ ప్లాట్ఫాం పైన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తమకి నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం. ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉండదు. దీనికి అందరూ, అన్నీ కారణములే. ఇక్కడ ఎవ్వరూ శ్రీరామచంద్రులు లేరు. ఎక్కడా సీతమ్మలు లేరు. ఉన్నవారంతా అటుఇటుగానీ వింతజాతి. ఇదిఇంతే. అదిఅంతే. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము. అరణ్య రోదన మాత్రమే.🙏🏽

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s