ప్రకృతి ప్రసాదించిన వరం పసుపు

🌺పసుపును కనీసము 3000 సంవత్సరాలనుంది భారతీయులు వాడుతున్నారు. 🌺

🌺చిన్నచిన్న గాయాలనుండి క్యాన్సర్ వ్యాధులవరకు పసుపు విరుగుడు గా పనిచేస్తుంది.

శరీరము పై ఏర్పడిన గాయాలకు, పుల్లకు పసుపు పూస్తే సుక్ష్మక్రిములు దరిచేరవు. సెప్టిక్ అవదు, త్వరగా మానుతుంది.

దీనిలోని “కర్కుమిన్‌ “వాపులను తగ్గిస్తుంది యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది. 🌺

🌺ఎన్నోవ్యాధులకు మందు:

మొటిమలు :

జామ ఆకులు పసుపు తో కలిపి నూరి రాయాలి.🌺

🌺కఫము :

వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. కఫము తగ్గుతుంది.🌺

🌺రక్త శుద్ధి :

ఆహారపదార్ధాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది.🌺

🌺దగ్గు,జలుబు :

మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టాలి.🌺

🌺నొప్పులు, బెనుకులు :

పసుపు, ఉప్పు, సున్నము కలిపి పట్టువేయాలి.🌺

🌺డయాబెటిస్:

ఉసిరి పొడి తో పసుపు కలిపి తాగాలి. మధుమేహవ్యాధి అదుపులో ఉంటుంది.

చిన్న గ్లాసు నీళ్ళ లో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టాలి.

ఉదయం నిద్రలేచాక పసుపు కొమ్ము తేసేసి ఒక చెంచా తో బాగా కలిపి పరగడుపున తాగితే చాలు చెక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.

ఈ నీళ్లు కొలెస్టిరాల్ ను, రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది.🌺

🌺తలతిరుగుడు :

పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి.🌺

🌺అల్జిమర్ వ్యాధి :

పసుపు లో ఉండే “కర్కుమిన్ “అనే పదార్ధము మతిమరుపును అరికడుతుంది.🌺

🌺ఆయుర్వేదిక్ గుణాలు :

పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.

సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.

పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు – కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.🌺

🌺వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.

పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.

వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే పలితం కనిపిస్తుంది.

వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.🌺

🌺మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.

నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.

పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.🌺

🌺దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.

పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.

రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.

చికెన్‌ఫాక్స్ (ఆటలమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.🌺

🌺పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.

పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.

పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.

వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.🌺

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s