భార్య భర్తల బంధం

కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు… ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే!

1.నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు…ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం.
నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా!
తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో.తప్పకుండా తను కూడా మంచి గృహిణి గా,మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది.

2.నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో…
నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని..నీవు మమ్మల్ని,నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని ప్రేమగా ఉండాలి.

3.నీతో సమానంగా తనని చూసుకో…నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో!నీ మంచిచెడులో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది.

4. పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి…కాస్త మోహమటంగా ఉండచ్చు…నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యి.

5.నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి…
ప్రేమించడానికి వయస్సుతో పనిలేదు.చిన్న,చిన్న సర్ప్రైజ్ లు,కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో..వారాంతంలో బయటికి తీసుకుని వెళ్లు. పుట్టింటికి తనతో కలసి వెళ్ళు.
నీ లాంటి భర్త, మా లాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనం అందరం ప్రవర్తిద్దాం…

ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను…అనుభవిస్తున్నాను..నా అనుభవాలను నీతో చెపుతున్నాను…నువ్వు కూడా మీ నాన్నలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ,నువ్వు సంతోషంగా ఉంటూ…మమ్మల్ని సంతోషంగా ఉంచుతావని నమ్ముతున్నాను…నిండు నూరేళ్లు ఆనందంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను…ఇష్టకామ్య ర్థ సిద్ధి రస్తు….❤

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s