మన వివాహ బంధం

*అసలు పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం, ఇష్టం-అయిష్టం గురించి కాదు. కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరిలో ఒకరు ఐక్యమైపోయి తమని తాము ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి చదువుకున్న భర్త, భార్య రావాలనుకకోవడం కన్నా తమ మనసులను చదవగలిగిన భర్త, భార్య రావడం అనేది వారి అదృష్టం.*_ _*అలాంటి అందమైన మనసున్న వారిని పొందాలని కోరుకోవాలి గాని, బయటకు కనిపించే పైపై అందాలను చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులను మాత్రమే చూసి ఇల్లు కొనుక్కొన్నట్లు ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు "అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు" చూడాలని. అంటే బలమైన పునాదులు, గట్టి గోడలు, నునుపైన పూతలు ఉన్నాయా లేదా అని చూడాలి.. అంటే వారి వంశ పుట్టుపూర్వోత్తరాలు చూడాలి..*_ _**భార్య భర్తల బంధం ఏంత బలంగా ఉండాలంటే, భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. అలాగే భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. అంతేకాదు భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి తప్ప అయోమయం కాకూడదు.*_ _**ఒకరి మనసులోని భావాలను మరొకరు చెప్పకుండానే అర్థం చేసుకొనేలా ఉండాలి. అంటే ఒకరి మనసులోని ప్రేమను గాని బాధని గాని కళ్లలో చూసి, నోటితో చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు కదా.. అలా అర్థం చేసుకొనే భార్య భర్తలు దొరికితే అడుక్కు తినేవారు కూడా ఆనందంగా హాయిగా జీవిస్తారు..*_ _**భార్య భర్తల బంధం ఒక మధురానుభూతిగా మిగిలి పోవాలి. అంటే ప్రతి భర్త తన భార్యను తన తల్లికి ప్రతి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను తన మొదటి బిడ్డగా పరిగణిస్తే అంతకు మించిన మధురమైన బంధం మరొకటి లేదు కదా..*_ _**సంసారం అంటే భార్య భర్తలు కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ ఒకరికి ఒకరు వెన్నంటి ఉంటూ, తోడూ నీడగా ఒకరిని ఒకరు వీడకుండా ఉండడం..*_ _**ఏది ఏమైనా, భార్యాభర్తల మధ్య సంబంధం శాశ్వతంగా ఉండిపోవాలి. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. కానీ చివరి వరకు భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. ఇది ప్రతి భార్య భర్తలు గుర్తుంచుకోవాలి..*_ _**నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం నీకు లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు. అలాగే నీవెన్ని గొప్ప చదువులు చదివినా, ఏంత గొప్ప ఉద్యోగం చేస్తూ ఏంతో గొప్పగా సంపాదించినా భర్త అండదండలు లేకపోతే ఆ భార్య జీవితం నిరర్ధకమే..*_ _**ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడెమో కానీ, భార్యను బాగా అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అలాగే ఒక మంచి భార్య తన భర్త మనసెరిగి భర్త మదనపడకుండా, మనస్థాపానికి లోనుకాకుండా చూసుకొంటుంది.. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే కదా..*_ _*అలాకాకుండా ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తూ, మిడిసిపాటుతో అహంకారి అయిన భార్య దొరికితే అంబానీ లాంటి వారు కూడా సన్యాసంలో కలవాల్సిందే. అలాగే దురలవాట్లకు బానిసైన వ్యసనపరుడైన భర్త దొరికితే ఆ భార్య జీవితం నరకప్రాయం అయినట్లే..*_ _**ఒక మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉండాలనుకొంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తానే రాణిగా ఉంటుంది.*_ _**తమ కుటుంబంలో తమ మధ్య ఎన్ని కీచులాటలున్నా సమాజంలో తన భర్త పరువును నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే అందరిముందు భార్యను చులకనగా చూడకుండా తన భార్యను అందరి ముందు గౌరవించవలసిన ధర్మం భర్తకు ఉండాలి.*_ _**భార్య భర్తల బంధం ఎలా ఉండాలంటే "గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండేలాంటి గట్టి బంధమై ఉండాలి." అలాంటి బంధం దొరకడం ఒక గొప్ప వరం..*_ _**భార్య భర్తల స్మృతులు ఎలా ఉండాలంటే "నీ సంతోషం నేను కాకపోయినా, నా చిరునవ్వు మాత్రం నువ్వే అయ్యుండాలి, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే అయ్యుండాలి " అనే విధంగా ఉండాలి..*_ _**భార్య భర్తలు ఇరువురు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరి పనులలో ఒకరు సహాయం చేసుకుంటూ సేవ చేయడం అంటే ఒకరి కింద ఒకరు బానిసగా బ్రతుకుతున్నామని కాదు ఇక్కడ అర్థం, ఒకరి బంధాన్ని మరొకరు గౌరవిస్తున్నామని అర్థం..*_ _*నిజానికి భార్య భర్తల బంధం అన్నది ఒక అందమైన పుస్తకం లాంటిది. జీవితంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఆ పుస్తకంలోని అచ్చు తప్పుల వంటివి. అచ్చు తప్పులున్నాయని మంచి పుస్తకాన్ని పారెయ్యలేము కదా.. అలాగే చిన్న చిన్న పొరపాట్లు జరిగినంత మాత్రాన బంధాలను తెంచుకోకుండా, మరొకసారి అలాంటి పొరపాటు జరుగకుండా చూసుకొనే వారి బంధం శాశ్వతంగా నిలిచిపోతుంది..*_ _**నీ భార్య గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగం చేస్తూ గొప్పగా సంపాదించేదిగా ఉండక్కర్లేదు. జీవిత పాఠాలను చదివి ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగి, నీ వంశాభివృద్ధి కోసం నీకు ఇద్దరు ప్రతినిధులను అందించే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!..*_ _**అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ నీ జన్మకు అర్థం లేదు. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి మసులుకొనేదే "మాంగల్య బంధం" అంటే..*_ _**అటువంటి బంధాలు తెగిపోకుండా శాశ్వతంగా ఉండాలి అంటే, ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. ఒకవేళ మనం తప్పు చేస్తే క్షమించమని ఎదుటి వారిని క్షమాపణ అడగాలి. ఒకరిపైన ఒకరికి ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానులు ఉండాలి. ముఖ్యంగా ప్రేమ అనేది చాలా విలువైనది. అందుకే "మన బ్రాహ్మణ వివాహం"అనే గుడిలో ప్రేమ అనే విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకొన్నపుడే వివాహబంధం రాణిస్తుంది..*_

*ఈ సృష్టిలో భగవంతుడు తీర్చిదిద్దిన సుందరమైన అతి గొప్ప కళాఖండం మన “మన కుటుంబం”. ఆ కుటుంబం వ్యవస్థను అర్థం చేసుకొని అవగాహనతో జీవించుదాం శుభమస్తు…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s