కాశీ క్షేత్రం లో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు..

శ్రీ చక్రం లో ఎలా అయితే 9 ఆవరణలు ఉంటుందో కాశీలో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు 7 ఆవరణలు ఉన్నాయి, వివిధ కోణాలు యంత్రం లో ఉన్నట్టు వివిధ ప్రాంతాల్లో ఒక ఆవరణలో ఒక కోణం ఈ క్రమం ప్రకారం మొత్తం 56 ఈ ప్రకారం 7 ఆవరణలో 56 కేంద్రాలలో కాస్మిక్ ఎనర్జీ అయస్కాంత శక్తి లాగా ఆకర్షిస్తుంది, క్రమంగా ఆ ప్రాంతంలో ఎక్కడ కూర్చుని ధ్యానం, మంత్ర జపం చేస్తే ఊహించని విధంగా మంత్ర ప్రయోజనం తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ త్వరగా ప్రచోదనం అవుతుంది.. మంత్ర త్వరగా సిద్ధిస్తుంది ఆ స్థలంలో ఉన్న శక్తి అటువంటి ది మీరు ఆ ప్రాంత్రాలలో నిరంతరం క్రమంగా కొద్దీ రోజులు ధ్యానం చేస్తే మీకు త్వరగా ధ్యానంలో మనసు నిలకడ లభిస్తుంది ఏకాగ్రత కుదరడం వల్ల మంత్రం శ్వాసతో లీనమై సిద్ది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది..

అయితే ఈ శక్తి కేంద్రాలు భావితరాలకు ఉపయోగ పడాలి అని మన పూర్వీకులు ఎక్కడ అయితే ఎక్కువగా శక్తి విశ్వం నుండి ఆకర్షించ బడుతుందో ఆ ప్రాంత్రాలలో వరుసగా విగ్నేశ్వరుడుని ప్రతిష్ట చేశారు.. కాశీలో ఉన్న ఈ ప్రసిద్ధ విగ్నేశ్వర దేవాలయాలు అన్ని కాస్మిక్ ఎనర్జీ కి నిలయాలి.. ఆలయం అక్కడ ఉంటే అక్కడ ప్రభావం తెలియని వారు కూడా అక్కడికి వస్తారు కాసేపు ఉంటారు అందువల్ల వారి శరీరంలో రోగ నిరోధక శక్తి, జ్ఞాపకాశక్తి పెరుగుతుంది…కాసేపు ఉన్నా ఎంతో ప్రశాంతంత కలుగుతుంది.. అటువంటి వినాయక అలయాలన్ని కలిపి “షట్టంచశద్వినాయకుల” అంటారు..ఈ 56 మంది వినాయకులను దర్శించటమే చప్పన్ యాత్ర అంటారు కానీ ఆ విగ్నేశ్వరుడు ఉన్న ప్రాంతాలు అన్ని శక్తి కేంద్రాలు కు ప్రసిద్ధ నిలయం అని చాలా తక్కువ మందికే తెలుసు. వాటి వివరాలు చూద్దాము..

👉ఇందులో ఏడు ఆవరణలుంటాయి ఒక్కో ఆవరణలో ఎనిమిది మంది వినాయకులు .ఏడు ఆవరణల్లో కలిపి యాభై ఆరు మంది అవుతారు.🙏

♦️మొదటి ఆవరణ లో♦️

లోలార్క కుండం లోనీ అర్క వినాయకుడు ,
దుర్గా కుండం లో దుర్గా వినాయకుడు ,
భీమ చండి లో భీమ చండీ వినాయకుడు ,
ప్రసిద్ధమ్ లో ఉన్న దేహలీ వినాయకుడు ,
భుయిలీ లో ఉద్దండ వినాయకుడు ,
సదర్ బజార లో పాశ పాణి వినాయకుడు ,
వరుణా సంగమం దగ్గరున్న ఖర్వ వినాయకుడు ,
మణి కర్ణికా ఘాట్ వద్ద సిద్ధి వినాయకుని దర్శిస్తే ప్రధమ ఆవరణం పూర్తీ అయినట్లు.

♦️రెండవ ఆవరణలో ♦️
కేదార్ ఘాట్ వద్ద లంబోదర వినాయకుడు ,
కుమి కుండ మహల్ దగ్గర కూట దంత వినాయకుడు ,
మాడు అమేహ్ వద్ద కాల కూటవినాయకుడు ,
ఫుల్ వరియా లో కూష్మాండ వినాయకుడు ,
వారాణసీ దేవి మందిరం లో ముండ వినాయకుడు ,
ధూప చండీ దేవి వెనుక వికట దంత వినాయకుడు ,
పులుహీ కోటలో రాజ పుత్ర వినాయకుడు ,
త్రిలోచనా ఘాట్ లో ప్రణవ వినయ దర్శనం తో ద్వితీయ ఆవరణం పూర్తీ .

♦️మూడవ ఆవరణం ♦️
చోసట్టీ ఘాట్ లో వక్ర తుండ లేక సరస్వతీ వినాయకుడు,
బంగాలీ బోలా వద్ద ఏక దంత వినాయకుడు ,
సిగిరావార్ లో త్రిముఖ వినాయకుడు (వానర ,సింహ ,ఏనుగు ముఖాల తో )పిశాచ మోచన తాలాబ్ పై పంచాస్య వినాయకుడు ,
హేరంబ వినాయకుడు ,
చిత్ర కూట సరోవర్ దగ్గర విఘ్న రాజ వినాయకుడు ,
ప్రహ్లాద్ ఘాట్ వద్ద వరద వినాయకుడు ,
ఆది దేవ మందిరం లో మోదక ప్రియ వినాయకుడు ల దర్శనం తో తృతీయ ఆవరణం సంపూర్ణం.

♦️నాలుగవ ఆవరణం ♦️

శూల కన్తేశ్వర స్వామి ఆలయం లోనీ అభయద వినాయకుడు ,
బాల ముకుంద చౌహట్టా లో సింహ తుండ వినాయకుడు ,
లక్ష్మీ కుండం పై కూణితాక్ష వినాయకుడు ,
పితృ కుండం పై క్షిప్ర ప్రసాదన వినాయకుడు ,
ఇసర్ గంగీ పై చింతా మణి వినాయకుడు బడా గణేష్ ఆవరణ లోనీ దంత హస్త వినాయకుడు ,
ప్రహ్లాద ఘాట్ లో పిచండిలా వినాయకుడు ,
వారాణసీ దేవి మందిరం లోనీ ఉద్దండ ముండ వినాయకుని దర్శిస్తే చతుర్ధ ఆవరణం పూర్తీ .

♦️అయిదవ ఆవరణం♦️

మాన్ మందిర్ ఘాట్ లో స్తూల దంత వినాయకుడు ,సాక్షి గణపతి వద్ద కలిప్రియ వినాయకుడు ,ధవేశ్వర్ మందిరం లో చతుర్దంత వినాయకుడు ,సూర్య కుండం దగ్గర ద్విదంత వినాయకుడు ,మహల్ కాశీ పురా లో జ్యేష్ట వినాయకుడు ,మిక్చర్ ఘట్టా లో గజ వినాయకుడు ,రాం ఘాట్ లో కాల వినాయకుడు ,ఘోసలా ఘాట్ లో నాగేశ వినాయకులను చూస్తె పంచమ ఆవరణం అయినట్లు.

♦️ఆరవ ఆవరణం♦️

మణి కర్ణిక వద్ద మణి కర్ణ వినాయకుడు ,
మీర్ ఘాట్ లో ఆశా వినాయకుడు ,
కాళికా గల్లీ లో సృష్టి వినాయకుడు ,
డుండి రాజు వద్ద యక్ష వినాయకుడు ,
బాన్స్ ఫాఠక్ వద్ద గజకర్ణ వినాయకుడు ,
చాందినీ చౌక్ లో చిత్ర ఘంట వినాయకుడు ,
పంచ గనఘా ఘాట్ వద్ద “స్థూల “, “జంఘ “వినాయకుల దర్శనం తో షష్ఠ ఆ వరణం పూర్తీ.

♦️ఏడవ ఆవరణం ♦️

జ్ఞాన వాపి వద్ద మోద వినాయకుడు ,
విశ్వనాధ కచాహరి లో ప్రమోద వినాయకుడు ,
సముఖ వినాయకుడు దుర్ముఖ వినాయకుడు గజ నాద వినాయకుడు ,
జ్ఞాన వాపీ దగ్గర జ్ఞాన వినాయకుడు
విశ్వనాధ ద్వారం వద్ద ద్వార వినాయకుడు అవి ముక్తేశ్వరుడి వద్ద అవి ముక్త వినాయకులను దర్శిస్తే సప్తమ ఆవరణ తో పాటు చప్పన్ వినాయక దర్శనం పరి పూర్తీ అయినట్లే.

👉సిద్దులు ,సాధకులు, తాంత్రికులు ఈ కేంద్రాల్లో ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారు యాత్ర కోసం వెళ్లే గృహస్థులు ఈ ప్రదేశాలను సందర్శించిన చాలా మంచి యోగం లభిస్తుంది.

♦️🙏శ్రీ మాత్రే నమః🙏♦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s