రెండు తప్పులు

ఈ రెండు తప్పులనుండి తప్పించుకుందాం.

సాధారణంగా మనిషి రెండు తప్పులను చేస్తుంటాడు . మొదటిది ఆత్మస్తుతి . రెండవది పరనింద . రెండూ తప్పులే . మనిషి తానెంత గొప్పవాడైనా తనను ఇతరులు పొగడాలి కానీ తనను తాను పొగుడుకోకూడదు .

” *ఇన్ద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః* ” !

దేవతల అధిపతి ఆయన దేవేంద్రుడు కూడా తన గొప్పతనాన్ని తానే ప్రస్తుతించుకుంటే చాలా చులకన అవుతాడని చెప్తారు . అందువలన ఎట్టి పరిస్థితులలోను మానవుడు ఆత్మస్తుతి చేసుకోకూడదు .

యితరులను నిందించటమూ పెద్దపాపమే . ఒకమనిషిని హత్య చేసినదానికంటే ఇది ఎక్కువ పాపం . ఇందుకు మహాభారతంలో ఒక ఉదాహరణ ఉంది . కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణునితో యుద్ధం చేయటం ధర్మరాజుకు ఒకప్పుడు చాలా కష్టమైంది . ఆ కష్టానికి తట్టుకోలేక ధర్మరాజు యుద్దభూమినుండి వెనుదిరిగి శిబిరానికి వెళ్ళిపోయాడు .

యుద్ధభూమిలో ధర్మరాజు కనపడక అర్జునుడు చాలా చింతించాడు . అతనికోసం వెదికి , వెదికి చివరికి , శిబిరంలో కనుగొన్నాడు . ధర్మరాజు వెంటనే ‘ కర్ణుని చంపావా లేదా ? ‘ అని అర్జునుడిని ప్రశ్నించాడు . లేదు అని అర్జునుడు సమాధానమిచ్చాడు . తాను ధర్మరాజును వెతుకుతూ అక్కడికి వచ్చానని చెప్పాడు . అప్పుడు కోపంతో ధర్మరాజు యిలా అన్నాడు . ‘ కర్ణుని చంపలేకపోతే నీకు గాండీవమెందుకు ? దండగ . దానిని ఎవరికైన దానం చేయి ‘ .ఆమాటలు వినగానే అర్జునుడి మనస్సు గాయపడింది . అతడు శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నించాడు . ‘ నా గాండీవాన్ని త్యజించమన్న వారిని చంపుతానని నేను శపధం పట్టాను . అందువలన నేను ధర్మరాజుని చంపాలి . కానీ ఆయన నా అగ్రజుడు . ఇప్పుడు నా శపథాన్ని నెరవేర్చు కొనడమెలా ? ‘

అర్జునుని ప్రశ్నకు శ్రీకృష్ణుడిలా సమాధానమిచ్చాడు . ‘ ధర్మరాజు వంటి మహాపురుషుని చంపాలనుకోవటమే మహాపాపం . కానీ నీ శపథాన్ని నెరవేర్చక తప్పదంటున్నావు . నీవు ధర్మరాజును ఎటువంటి కారణం లేకుండానే నిందించు . అలా నిందించటమే హత్య చేసినట్లు ‘ అని .

దీనినుండి ఒక వ్యక్తిని నిందించటం అతనిని హత్య చేయటంకంటే ఘోరమైన పాపమని మనకు తెలుస్తుంది . అందువలన మనల్ని మనం పొగుడుకోవటం , యితరులను నిందించటం మనం చేయకూడని పనులు . మన జీవితంలో ఆ రెండు తప్పులు చేయకూడదు .

*యదీచ్చసి వశే కుర్తం జగదేకేన కర్మణా !*

*పరాపవాద సస్యేభ్య: గాశ్చరన్తీర్నివారయ !!*

యితరుల గురించి చెడుగా మాట్లాడటం మానివేస్తే ప్రతియొక్కడు
నీ వాడవుతాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s