
Manners

One day a farmer’s donkey fell into a well. The animal cried loudly for hours, while the farmer tried to find something to do to get him out.
Finally, the farmer decided that the donkey was old and the well was already dry and needed to be covered anyway; that it really wasn’t worth pulling the donkey out of the well..
He invited all his neighbors to come help him. They each grabbed a shovel and began to throw dirt into the well.
The donkey realized what was happening and cried horribly loud. Then, to everyone’s surprise, he quieted down after a few shovelfuls of dirt.
The farmer finally looked down into the well and was amazed at what he saw… with each shovelful of dirt, the donkey was doing something incredible: It was shaking off the dirt and stepping on top of the dirt.
Very soon everyone saw surprised how the donkey reached the mouth of the well, went over the edge and trotted out…
Life is going to throw dirt at you, all kinds of dirt… the trick to getting out of the hole is to shake it off and use it to step up. Each of our problems is a step up. We can get out of the deepest holes if we don’t give up…
Use the land they throw you to get ahead!!!
Remember the 5 rules to be happy:
1. Free your heart from hate.
2. Free your Mind of distractions.
3. Simplify your life.
4. Give more and expect less.
5. Love more and… shake the dirt, because in this life you have to be a solution, not the problem!
Author: Edmond Dantes
నేను ఎప్పుడు ” అనుష్ఠానానికి ” కూచున్నా సరిగ్గా టాయిలెట్స్ కడిగే అమ్మాయి అప్పుడే వస్తుంది. మనిషి బక్కపలచగా నీరసంగా ఉంటుంది. జక్కంపూడి నుంచి రానూపోనూ 50/-ఇచ్చి ఆటో
కానీ ఆ అమ్మాయికి ఆకలి, అరడజను ఆడపిల్లల ఆలనా పాలనా తప్ప మన సెంటిమెంట్ పట్టదు అని గ్రహించా.
నాలాంటి వారు నలుగురు పని చెబితేనే ఆరోజు గడుస్తుంది ఆ ఇంటిల్లిపాదికి.
ఆటో చార్జీలు దాన్లో మళ్ళీ ఆసిడ్ బాటిల్, ఫినాయిల్ కి పెట్టుబడి పోగా మిగిలే ఏ యాభయ్యో, వందో రూపాయల కోసం మనం అసహ్యించుకునే పనిని ఆప్యాయంగా చేస్తుంది. అటువంటి అమ్మాయిని ఇవ్వాళ శుక్రవారం.. పైగా పూజ మధ్యలో ఉన్నా..రేపురా అని ఎలా అనగలను??
అలా అంటూ..” అన్తశ్చరతి భూతేషు *
చదువుతున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి?? అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోను?? అందుకే పూజ ఆపి ఆ అమ్మాయి పని అయి పంపాకే శేషానుష్ఠానాన్ని సాగిస్తున్నా.
ఇక్కడే నాకు సందేహం ** వచ్చింది!!
అసలు ” అనుష్ఠానం “అంటే ఏమిటని!!??
అనుష్ఠానం ఒక పవిత్రమైన పదం.
పదం ఎంత గంభీరమో! దాని అర్ధం కూడా అంతే గూఢం.
భగవంతుడికి సంబంధించిన పదం కాబట్టి దీని అర్ధం విలక్షణంగానూ విస్తృతంగానూ ఉంటుంది.
” ఫలానాలా చేస్తేనే అనుష్ఠానం “ అని గిరి గీసి చెప్పటానికి లేకుండా ” గిరి ” అంత ఉన్నతమైన విలువ కలది. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతునిలానే అనిర్వచనీయం.
సమాజహితం కోసం ఏకాగ్రత తో చేసే అనుష్ఠానం, ధ్యానం లేదా తపస్సు ఒక దృఢమైన సంకల్పశక్తి గా లోకకల్యాణానికి ఎలా మారుతుందో! మహానుభావుల చరిత్ర చూస్తే తెలుస్తుంది.
మరి మనం అలా చెయ్యాలంటే అంత మానసిక శారీరక తుష్టి పుష్టి మనకి ఉందా? అంత ఏకాగ్రత మనం సంపాదించుకోగలమా?? ఖచ్చితంగా నాలాంటి వాడు చెయ్యలేడనే చెప్పాలి. మరి సమాజానికి మన అనుష్ఠానం ఉపయోగపడటం ఎలా??
ఎలా అంటే, ” మన స్థాయిలో సమాజానికి ” ఉపయోగపడేలా మనం చేసే ప్రతీ చర్యా అనుష్ఠానమే. అలాంటి అనుష్ఠానాలు అవలోకించి చూస్తే అడుగడుగునా బోలెడు.
ఉదాహరణకు :
— జోరున వర్షం పడుతోంది.పక్కవాటా వాళ్ళు లేరు.కానీ వారు ఆరేసిన బట్టలు వానలో తడుస్తున్నాయి. వెంటనే మీరు అవి తీసి మడతబెట్టి రాగానే ఇస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారో కదా?
—- తెల్లవారుజామున మీరు జిమ్ కని బండి మీద వెళ్తున్నారు. ఇంతలో ఒక పెద్దమనిషి చేతిలో సూట్ కేస్ తో అటూ ఇటూ ఆదుర్దాగా చూస్తున్నాడు.
మీకు అర్ధం అయ్యింది ! ఆయన స్టేషన్ కి వెళ్లాలని. కనుచూపుమేరలో ఆటో కనపడటం లేదు. పోనీ మీ పని అంత అర్జంట్ కానప్పుడు ఆగి స్టేషన్ దగ్గర దింపితే ఆయన కి ఎంత ఊరట!! రైలు లో కూచొని ” దైవం మానుష రూపేణా “!! అన్నట్లు ” దేముడిలా అతనెవరో దించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది?” అన్న ఆయన కృతజ్ఞతా తలంపు మీకు ఎంత పెద్ద దీవెన!!
ఇలాంటివన్నీ అనుష్ఠానాలు కాదూ!!
— పండగ వచ్చింది. లాక్ డౌన్ మూలంగా పక్కవారు ఎక్కడో ఉండిపోయారు. పండగ రోజు కాస్త ముగ్గు, నాలుగు మామిడాకులు వాళ్ళ గుమ్మం ముందు ఉంచితే మన బతుకు పచ్చ తోరణం అవ్వదూ!!
— మన నోటికి భయపడి జోరు వర్షం లో కూడా మానకుండా వచ్చే పనిమనిషికి మనం తాగే కాఫీ లాంటిది ఇస్తే ఆ అమ్మాయి లో కలిగే
అల్ప కృతఙ్ఞత మనకి
అనల్పసంతోష హేతువవ్వదూ!!
— మన ఇంట్లో మనం తినటం కన్నా పక్క ఇంట్లో భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా వడ్డిస్తారో అలాగే మన ఒంట్లో భగవానుడు..పక్క ఒంట్లో వాడికి పెడితే అంతగానూ సంతోషపడతాడు కదా!!.
— భార్య శ్రద్ధగా వంట చేసి పెడుతుంటే మెచ్చుకోవడం,
పక్కవాడి తులసిమొక్కకి కాసిని నీళ్లు పోయడం,
వాళ్ళ కుక్కకి అన్నం పెట్టడం..ఇలా ఎన్ని రకాల అనుష్ఠానాలని!!
— చీరల షాపులో పనిచేసేవారికి సరైన పౌష్ఠీ కాహారం ఎక్కడ ఉంటుంది?? పైగా షాపులో ఉన్నంతసేపు అలా నుంచొని ఉండాల్సిందే.!!.డజన్లకొద్దీ చీరలు తీయిస్తూ,
ఆ సేల్స్ గర్ల్ సహనాన్ని పరీక్షిస్తూ, ఒక చీర కనీసం జాకెట్ కూడా తీసుకోకుండా వెళ్ళేవాళ్ళు ఎందరో??
ఆ అమ్మాయికి ” అమ్మే తెలివితేటలు లేవని ” ఓనర్ తిట్టే అరుపులు మన చెవికి వినపడవు. గతిలేని ఆ అమ్మాయి కన్నీరు మనకి కనపడదు…ఇది గ్రహించని మనం చేసే పూజకి పరమార్థం ఉందంటారా??
— ఎక్కే గుమ్మం దిగేగుమ్మం గా ఉద్యోగాలు చేసేవారు.. ఉంటారు. ఉదాహరణకు కేబుల్ టీవీ వాళ్ళుబిల్లు కోసం మూడంతస్తులు ఆయాసపడి ఎక్కివస్తే, మళ్ళీ రండి “అని విసుక్కోకుండా వెంటనే కట్టేస్తే ఆ చిరుద్యోగి ” అందరూ ఇలా ఉంటే ఎంత బాగుండు!!” అనుకోడూ!! అతనికి లభించిన ఆ చిన్న స్వాంతన భగవంతుడు మీ వైపు చూసేలా చెయ్యదూ?
—- ఒక చిన్న సైకిల్ మూలంగా మొత్తం ట్రాఫిక్ ఆగిపోతే ఎవరికి వారు నామోషీకి పోయి కార్లు, బళ్ల మీద బిర్రబిగుసుకుని కూచోకుండా ఆ సైకిల్ మీరు జరిపితే కొంతైనా సంస్కారం ఉన్న వ్యక్తులు మీ వైపు కృతజ్ఞతతో చూసే చూపు మీ వైటల్ ఎనర్జీ ని రెట్టింపు చెయ్యదూ??
— ఏదో వీక్ ఎండ్ లో మీరు ఏ పుణ్యక్షేత్ర మో వెళ్తున్నప్పుడు మీ కుటుంబసభ్యులు తో బాటు ఏ బీదవారినో ఒకర్ని తీసుకెళ్లి దర్శనం చేయిస్తే గుళ్లో దేముడు బోల్డు సంతోష పడిపోడూ??
—- మన ఇంట్లో పూచినవో, కాచినవో నలుగురికీ మనస్ఫూర్తిగా అందిస్తే, ఆ చెట్లు మరింత ఇవ్వడానికి సిద్దమవుతాయట. వాటి సగటు ఆయుర్దాయం కూడా పెరుగుతుందని చదివా. మనఇంటి పూలతో నలుగురూ చేసే పూజ, మన కాయలతో చేసే వైద్యమో, నైవేద్యమో!! ఎంత మంది చేస్తే అంత అనుష్ఠానం మనం చేస్తున్నట్లు కాదూ!!
— నేను చూస్తూ ఉంటా..చాలామంది ఇంట్లో చెత్త ని రోడ్డు మీద ఎవరూ చూడట్లేదన్న భ్రమలో ఇంకోరి ఇంటిముందు పారపోసేస్తూంటారు.
కొంతమంది చెత్త బుట్ట లో వేస్తారు కానీ దాన్లో కుమ్మరించడం వలన తీసుకెళ్లే పారిశుధ్య కార్మికులకు ఎంతో అవస్థ. కొన్ని చెత్తబుట్టలు చిల్లులు పడినా మార్చరు.. వాటినుంచి చెత్తరాలుతూ, కారుతూ ఉంటుంది..తినడానికి, సినిమాలకి పెడతాం కానీ చెత్త బుట్ట మంచిది కొననే కొనం.
పాపం ఆకార్మికుడు మనసు కష్టపెట్టుకున్నా మనకి చెప్పే ధైర్యం అతనికి ఉండదు. చెత్త నంతటినీ కారి బాగ్స్ లో పెట్టి వేస్తే తీసుకెళ్లే అతనికి ఎంత సౌకర్యంగా ఉంటుంది!! ఇలాంటి చిన్న సామాజిక బాధ్యత ని గుర్తించి మన వంతు కర్తవ్యాన్ని మనము నిర్వహిస్తే అంతకన్నా పెద్ద అనుష్ఠానం ఇంకేముంటుంది??
చివరిగా ఒక ఆహ్లాదమైన అనుష్ఠానాన్ని చెబుతా..
ఆ మధ్య “హంసల దీవి ” కి వెళ్ళా…నాకు తెలుసు అక్కడ బెస్తవారి పిల్లలు ఉంటారు. వాళ్ళకి చేపలు, సముద్రం తప్ప వేరే లోకం తెలియదు.
కార్లు, బైకులు వేసుకొచ్చి సముద్రంలో దిగి ఆటలాడుతూ తింటూ, తాగుతూ ఉండే మనుష్యులని ఆశ్చర్యంగా ఆశగా చూస్తూ దూరంగా ఉంటారు.
నేను వారికి సర్ ప్రైజ్ ఇద్దామని “కొన్ని వేఫర్లు..కొన్ని మిల్క్ డైరీ చాకలెట్స్ తీసుకెళ్లి పిలిచా” అవి చూపిస్తూ.
ముందు రామంటూ అడ్డంగా తల ఊపుతూ పారిపోయారు. తర్వాత దూరంగా నన్ను చూస్తూ నిలబడ్డారు. ఒకళ్లిద్దరు గుడిసె లో దూరి వాళ్ళమ్మకి చెప్పినట్లున్నారు. ఆవిడ తల బైట పెట్టి నన్ను చూసి ఏమనుకుందో ఏమో!! వాళ్ళకి ఏదో చెప్పింది.
అప్పుడు వాళ్ళు భయం భయం గానే దగ్గరకి వచ్చారు. అప్పుడు నేను చాకలెట్స్ ఇస్తూ వాళ్ళ వివరాలు కనుక్కుంటూ కబుర్లు చెప్పా.
ఆ వేఫర్స్, చాకలెట్స్..వాళ్ళు ఎప్పుడూ తినలేదట!.ఎవరూ ఇవ్వలేదట!! అసలు వాళ్ళని చేరదీసి ఇలా పలకరించింది లేదనే !చెప్పారు.
మాటల్లో సముద్రం గురించి ఎన్ని విషయా లు చెప్పారో?? ఆశ్చర్యం వేసింది.
“అలలు, వారి వలలు
చేపలు , తెరచాపలూ
బోటులు, కడలి అటు పోటులూ”..
ఇలా మా మధ్య స్నేహం కుదిరిన ఆ గంట అలా అలలా జారిపోయింది..నా హృదయం అల జారిన మెత్తని ఇసుకగా మారిపోయింది.
కొందరు ఆ చాక్ లెట్స్ కాగితాలు దాచుకున్నారు జేబుల్లో.
ఆడపిల్లలయితే నెమ్మదిగా తింటూనే ఉన్నారు.
చెలియల కట్ట దాటిన ఆ చిన్నారుల స్వచ్ఛ దరహాస తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పరుగున వెళ్లి వాళ్ళు దాచుకున్న గవ్వలూ, ఆల్చిప్పలు,నత్తగుల్లలు..ఇత్యాదివి పోటీపడి చూపించారు. ” అచ్చంగా నన్ను తీసుకోమని ” ఒకరిద్దరు కోరారు కూడా. నాకు ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆ ” శైశవతపన ” చూస్తే ఎంత ముచ్చటేసిందో!!
నేనిచ్చిన చిన్న కానుక్కే వాళ్ళ మొహాలు లైట్ హౌస్ లా మారి వింతకాంతిపుంజం విరబూసి జీవితం పట్ల నా కున్న దృక్కోణానికి దిశానిర్దేశం చేసాయా ?? అనిపించింది.
చాలు ఈ జీవితానికి!! ఆ పసిమనసుల సమక్షంలో నేను చేసుకున్న ఈ ” చిన్ని అనుష్ఠానం ” . *
ఇలా చేసే అనుష్ఠానాలు కాకుండా, కొన్ని చేయకుండా ఉంటే అనుష్ఠానాలుగా మారేవి ఉన్నాయి :
ఉదాహరణకు
తన దారిన తాను పోతున్న కుక్కనో, పందినో ఊరికే కొట్టడం, నడుస్తున్న వారి మీద రోడ్డుపై నిలిచిన వాననీళ్లు పడేలా బళ్లు వేగంగా నడపడం,
అందుతున్నాయికదా!! అని అనుమతి లేకుండా పక్కవారి పూలు కాయలు కోసేయడం ఇలాంటివి చేయకుండా ఉంటే అనుష్ఠానం చేసినట్లే!!
ఇలా రాస్తూ పోతే ఎన్ని రకాల అనుష్ఠానాలైనా చెప్పచ్చు , చేస్తూ పోవచ్చు..
తోటివారి ని సంతోష పెట్టేదో, సాటివారి కన్నీరు తుడిచేదో!! ఏదైనా ” అనుష్ఠానమే “
మీరూ ఆలోచించండి.. ఆరంభించండి.
*శరీరానికి ఎంత కాంతి !
*మనసుకు ఎంత శాంతి !!
🌺పసుపును కనీసము 3000 సంవత్సరాలనుంది భారతీయులు వాడుతున్నారు. 🌺
🌺చిన్నచిన్న గాయాలనుండి క్యాన్సర్ వ్యాధులవరకు పసుపు విరుగుడు గా పనిచేస్తుంది.
శరీరము పై ఏర్పడిన గాయాలకు, పుల్లకు పసుపు పూస్తే సుక్ష్మక్రిములు దరిచేరవు. సెప్టిక్ అవదు, త్వరగా మానుతుంది.
దీనిలోని “కర్కుమిన్ “వాపులను తగ్గిస్తుంది యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది. 🌺
🌺ఎన్నోవ్యాధులకు మందు:
మొటిమలు :
జామ ఆకులు పసుపు తో కలిపి నూరి రాయాలి.🌺
🌺కఫము :
వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. కఫము తగ్గుతుంది.🌺
🌺రక్త శుద్ధి :
ఆహారపదార్ధాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది.🌺
🌺దగ్గు,జలుబు :
మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టాలి.🌺
🌺నొప్పులు, బెనుకులు :
పసుపు, ఉప్పు, సున్నము కలిపి పట్టువేయాలి.🌺
🌺డయాబెటిస్:
ఉసిరి పొడి తో పసుపు కలిపి తాగాలి. మధుమేహవ్యాధి అదుపులో ఉంటుంది.
చిన్న గ్లాసు నీళ్ళ లో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టాలి.
ఉదయం నిద్రలేచాక పసుపు కొమ్ము తేసేసి ఒక చెంచా తో బాగా కలిపి పరగడుపున తాగితే చాలు చెక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.
ఈ నీళ్లు కొలెస్టిరాల్ ను, రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది.🌺
🌺తలతిరుగుడు :
పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి.🌺
🌺అల్జిమర్ వ్యాధి :
పసుపు లో ఉండే “కర్కుమిన్ “అనే పదార్ధము మతిమరుపును అరికడుతుంది.🌺
🌺ఆయుర్వేదిక్ గుణాలు :
పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు – కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.🌺
🌺వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే పలితం కనిపిస్తుంది.
వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.🌺
🌺మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.🌺
🌺దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
చికెన్‌ఫాక్స్ (ఆటలమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.🌺
🌺పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.🌺
ఒక ముసలాయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు
ఇది గమనించిన ఒక యువకుడు
తాతయ్య ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు
నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది
నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నారు తాతయ్య
అయితే ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా మరి ఎందుకు అంత జాగ్రత్త అన్నారు
అద్దం ఎన్నో పాఠాలు నేర్పుతుంది నీకు తెలుసా అన్నారు తాతయ్య
అవునా ఏంటో అవి చెప్పండి అని ఆతృతగా అడిగాడు ఆ యువకుడు
నువ్వు అద్దంలో కి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటె అంతే చూపెడుతుందిగా అన్నారు
అవును అన్నాడు ఆ యువకుడు
ఎక్కువగానో తక్కువగానే చూపదుగా అన్నారు
అవును తాతయ్య అన్నాడు
అద్దం లాగ నువ్వు కూడా నీ స్నేహితులకు నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం
తప్పైతే తప్పని ఒప్పైతే ఒప్పని అంతే కానీ ఎక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు అన్నారు
ఇది మొదటి పాఠం
అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది
నువ్వు లేకపోతే నువ్వు చూపెట్టదు అలాగే
ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి వారి వెనుక మాట్లాడకూడదు అని అర్థం
ఇది రెండవ పాఠం అన్నారు
అద్దం మన ముఖంపైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో పగలకొట్టము కదా అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా అవి సరిచేసుకోవాలి అని చెబుతుంది
ఇది మూడవ పాఠం అన్నారు తాతయ్య
ఇంత చిన్న అద్దంతో ఇన్ని పాఠాలా
చాలా మంచి విషయాలు నేర్పారు తాతయ్య మీకు కృతజ్ఞతలు అంటూ ఆ యువకుడు శలవు తీసుకున్నాడు.
నాకు నచ్చిన కాశీభొట్ల కామేశ్వర రావు గారి “దుప్పటి” కథ. పాతదే ఐనా మళ్ళీ మళ్ళీ చదివించే కథ.
దుప్పటి
కాశీభొట్ల కామేశ్వర రావు
ఈ చిన్న కథలో అరవై ఏళ్ల క్రిందటి కోనసీమ వాతావరణం, అక్కడి మనుషుల మధ్య సంబంధాలు, ఆకుపచ్చటి కొబ్బరి తోటలు, గలగల పారే కాలవలూ , పిల్లలు చదువుకునే బళ్లూ, వాళ్ళు తినే చిరుతిళ్ళు, గోదావరిపై ప్రయాణాలు….. అన్నీ ఎంచక్కా స్మృతిపథంలో తిరుగాడుతాయి. ఓసారి అందమైన బాల్యంలోకి మనసు మళ్ళిపోతుంది.
* * *
దుప్పటి
కాశీభొట్ల కామేశ్వర రావు
(శ్రీ కామేశ్వర రావుగారి స్వగ్రామం అమలాపురం తాలూకా ఇందుపల్లి. కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేసి, అమలాపురం పురపాలక సంఘ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేరు.
వీరు సాహిత్యం పట్ల చిన్ననాటి నుంచీ మంచి అభిరుచి కలిగినవారు. ఈయన అడపాదడపా ఓ డజను కథలుదాకా రాశారు కానీ, ఈ దుప్పటి మాత్రమే లభ్యమౌతోంది.)
ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉండేవి. అమలాపురంలో బస్సెక్కి, బొబ్బర్లంక రేవు దాటి ఆలమూరు మీదుగా వెళ్ళడం ఒకటి;
లేదా ముక్తేశ్వరం వచ్చి, రేవు దాటి కోటిపల్లి మీదుగా రాజమండ్రి చేరడం మరొకటి. (అప్పటికి రావులపాలెం వంతెన పడలేదు. అందువల్ల ఇవే మార్గాలు).
సాధారణంగా రాముడు ఎప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళినా ఆలమూరు మీదుగానే వెళ్ళేవాడు. అయితే ఈసారి ఆ బస్సు దాటిపోయింది. అంచేత తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసి వచ్చింది.
ముక్తేశ్వరం రేవులో బస్ దిగి, రేవు దాటడానికి లాంచీ టికెట్టు తీసుకుంటున్నాడు.
ఇంతలో “ఒరేయ్.. రావుడూ! ఒరేయ్ రావుడూ !” అంటూ పరిచిత కంఠం వినిపించింది.
అతను వెనక్కి తిరిగి చూశాడు. కుంటి సోమన్న! అవును కనిపించేది కుంటి సోమన్నే.
కుంటి సోమన్నది రావుడూ వాళ్ల ఊరే. రావుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు , వాళ్ల స్కూలు పక్కనే కుంటి సోమన్న పెసరట్ల కొట్టు ఉండేది. ఉదయం పూట పెసరట్లు, మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చ వెచ్చగా బడి పిల్లలకి దొరికేవి. ఏదయినా, ఒక కానీ ఖరీదు!
ఈ పిల్లలకి తోటల్లో దొరికే కొబ్బరిపళ్ళు (రాలిన ముదురు కొబ్బరికాయలు) పట్టుకెళ్ళి కుంటి సోమన్నకే అమ్మేవారు. అప్పుడు కొబ్బరిపండు ఖరీదు కూడా ఒక కానీయే. వీళ్ళు ఇలా కొబ్బరి పండిచ్చి అలా కొబ్బరి లౌజు తీసుకునే వారు.
సోమన్నకి ఆ కుంటితనం ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆ కారణంగా అతనికి పెళ్లి కాలేదు.
ఓ అంగవస్త్రం కట్టుకుని పెనం దగ్గర కూర్చునేవాడు. ఈ వ్యాపారంలో లాభం తియ్యాలనే ఆశ
కుంటి సోమన్నకి లేదు.
ఆ వీధిలోనే అతని అన్నదమ్ములున్నారు. రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు. కాకపోతే అతనికి నల్లమందు అలవాటొకటి ఉండడంవల్ల …..దానికి రోజూ ఓ అణా కావలసి వచ్చేది. ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజూ ఒక్క అణా మాత్రమే.
అప్పుడప్పుడు పిల్లల దగ్గర డబ్బులు లేనప్పుడు , వాళ్ళకి తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించే వాళ్ళు. కొందరి కుర్రాళ్ల ప్రయత్నం సఫలమయ్యేది కూడా. అయితే అది సోమన్న దృష్టిలో పడనే పడేది.
“వెర్రి వెధవల్లారా! కావాలని ఏడవకూడదూ? నేనే ఇద్దును కదా!” అంటూ మిగిలినవి తక్కిన కుర్రాళ్ళకి పంచిపెట్టేవాడు.
సోమన్న కొట్టు దగ్గరే కాలవ. ఈ కుర్రాళ్ళు ఆ కాలవలో ఈదేందుకు సోమన్న సాయం చేసేవాడు. కుంటివాడనే మాటే కానీ కాలువ ఈ మూలనుంచి ఆ మూలకి నాలుగు బారల్లో ఈదేసేవాడు. పిల్లలందరికీ చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు.
సోమన్న కొట్టు ఎదురుకుండా ఉన్న చింతచెట్టు కింద ఓపాక వేసి, రాముణ్ణి ప్రతిష్ఠించి , పిల్లలు భజన చేసేవారు. ప్రసాదాలు చేసి, పంచిపెట్టే బాధ్యత సోమన్న తీసుకునే వాడు. ఆ విధంగా రావుడితోపాటు పిల్లలందరి బాల్యజీవితంలోనూ సోమన్న ఓ భాగం అయిపోయాడు.!
ఆ సోమన్న రావుడికిప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనిపించాడు.
“ఇలాగ ఎక్కడికి పోతున్నావ్?” అన్నాడు.
“రాజమండ్రి…., ఉద్యోగం చేస్తున్నానక్కడ” అన్నాడు రావుడు.
“అబ్బో! పెద్దవాడవయ్యావురోయ్,” అన్నాడు సోమన్న ఆనందంగా.
“నువ్విక్కడున్నావేమిటీ ?” అంటూ , ఎదురుగా ఉన్న పెనం , పెసరట్ల పొయ్యి చూసి ‘నేను ఎంత తెలివి తక్కువగా అడిగేను’ అని అనుకున్నాడు రావుడు.
రోజులు మారిపోయాయనీ, తన పొట్ట తానే పోషించుకోవలసి వస్తోందనీ, ఓ రోజున పెనం, అట్లకాడా పుచ్చుకుని వాళ్ల ఊరునుంచి ఇక్కడకి వచ్చేసేననీ , ఇప్పుడిక్కడే ఉంటున్నాననీ చెప్పేడు సోమన్న. “పెసరట్టు కాల్చనా? ఇంకా నీకు లాంచికి అరగంట టైముంది.” అంటూ పెనం మీద రెండు పెసరట్లకి పిండి పోశాడు సోమన్న.
ఒకసారి మంట ఎగదోసి, “ఒరేయ్! విశ్వనాథంగాడు ఎక్కడున్నాడురా ఇప్పుడు?” అన్నాడు. విశ్వనాథం రావుడి చిన్ననాటి స్నేహితులలో ఒకడు. మంచి చురుగ్గా ఉండేవాడు.
“వాడిప్పుడు హైదరాబాదులో రైల్వేలో పనిచేస్తున్నాడు” అన్నాడు రావుడు.
“ఎప్పుడూ ఎవ్వరూ కనబడరురా” అన్నాడు సోమన్న పెసరట్టు మీద నెయ్యి పోస్తూ.
“ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకోసారి కనపడుతుందిరా. దాని అత్తారు కోటిపల్లే. ఇద్దరు పిల్లలు…. పలకరించి వెళ్తూంటుంది.” అంటూ పెసరట్లు ఆకులో వేసి అందించాడు సోమన్న.
రావుడి మనస్సు తన చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తోంది. ఇంతలో లాంచి హారను వినిపించింది. ఉలిక్కిపడ్డాడు రావుడు.
“ఫర్వాలేదులే….ఇంకా పావుగంట ఉంటుంది.” అన్నాడు సోమన్న. ఘుమఘుమలాడే పెసరట్లు రెండు తిని, ఓ అర్ధరూపాయి సోమన్న కివ్వబోయాడు రావుడు. సోమన్న తీసుకోలేదు.
“ఉంచు.” అన్నాడు రావుడు.
“వద్దు…. డబ్బెందుకురా నాకు?” అని క్షణం ఆగి, “ఒరేయ్ రావుడూ! చలికి మహా బాధపడుతున్నాను–ఈ గోదావరి వార. దుప్పటీ గుడ్డ ఏదైనా ఉంటే పడేద్దూ.” అన్నాడు సోమన్న. ఆ అడగడంలో యాచనా, దైన్యం ఏమీ లేదు. ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు.
రావుడి చేతిసంచీలో ఓ దుప్పటి ఉంది కూడా. కానీ అది ఒక వారంరోజుల కిందటే కొన్నాడు. దాని ఖరీదు పది రూపాయలు! అది ఇచ్చేద్దామా అని ఒక్కసారి రావుడికి అనిపించినా, అతని నాలుక మాత్రం యాంత్రికంగా, “ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే,” అంది.
రావుడు సంచీ పుచ్చుకువచ్చి లాంచీలో కూచున్నాడు. గోదావరి కెరటాల మీద లాంచీ ఉయ్యాలలూగుతూ పోతూ ఉంది. రావుడి మనసు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసలాడుతూ ఉంది. చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కరే జ్ఞాపకానికి రాసాగారు.
‘చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో ఉందిట. అప్పట్లో వాళ్ల తరగతిలో తనే పెద్దపిల్ల. ఆదిలక్ష్మి శుద్ధ మొద్దుపిల్ల. తన లెక్కలు చూసి చేసేసేది. మేష్టారితో చెప్తానంటే మొట్టికాయలు మొట్టేసేది. శ్యామలా, మంగాయీ అప్పచెల్లెళ్లు. ఇద్దరూ ఒకే క్లాసు. వాళ్ళింటిదగ్గర మెట్టతామర పువ్వులుండేవి. సుందరికి ఆ పువ్వులంటే ఎంతో ఇష్టం. తను కోసుకొచ్చి ఆమెకిస్తూండేవాడు. సుందరి ఇప్పుడెక్కడుందో? నలుగురు పిల్లల తల్లై ఉంటుంది.
వేసవి వెన్నెల రాత్రుల్లో తన స్నేహితులతో కలిసి, మావిడి చెట్టుకింద కూర్చుని దూరంనుంచి వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునే వాళ్ళం! గుయ్యంగాడూ, ఆంజనేయుడి వేషం వేసే ఆ సత్యంగాడూ– వీళ్ళందరూ ఇప్పుడెక్కడికి పోయారో? ఇంక మళ్ళీ జీవితంలో అలా ఆడుకోగలనా?’ కరిగిపోయిన కాలాన్ని గురించి ఆలోచిస్తోంది రావుడి మనస్సు.
ఆ మధుర స్మృతులన్నీ అతనిలో తట్టిలేపి, తీయని రోజుల్ని జ్ఞాపకానికి తెచ్చిన వాడు సోమన్న! దానికి కృతజ్ఞతగా సోమన్నకి తనేమిచ్చాడు? ఒక్క దుప్పటీగుడ్డ అడిగాడు. అది కూడా ఇవ్వలేని క్షుద్రుడ్నయ్యాను.
అలా ఆలోచిస్తూ ఒక్కసారి ఒడ్డువైపు చూశాడు రావుడు. సోమన్న ఉండే పాక చిన్నగా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ అందరూ సోమన్నని ఎరుగుదురు. లాంచీ దిగి, ఏ పడవ వాడికైనా దుప్పటీ ఇచ్చి పంపిద్దామనుకున్నాడు. కానీ ఆ కొత్త దుప్పటీ సోమన్నకివ్వక వాడే ఉంచేసుకుంటే??
ఇలా ఆలోచిస్తూన్న రావుడికి ‘సోమన్న సొమ్ము ఎవడూ అపహరించడులే’ అని మాత్రం అనిపించలేదు.
పడవ దిగి, బస్సెక్కేడు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామల ప్రదేశాలు కన్నులపండుగగా ఉన్నాయి. వాళ్ళ బడికి అవతలిపక్క అలాంటి చేలే ఉండేవి.
పెసర పైరు వేసినప్పుడు పిల్లలందరూ చేలోకి వెళ్ళి పెసర రొట్ట పీకి కాల్చుకుని తినేవాళ్ళు.
రావుడు ఊహాల్లో వుండగానే బస్సు రాజమండ్రి చేరింది. రాజమండ్రిలో దిగి, తనపనిలో తాను కూరుకుపోయినా, ఆ భావోన్మత్తత, అందుకు కారణమైన సోమన్నా రావుడి మనస్సును విడిచిపెట్టలేదు. మరునాటి మధ్యాహ్నానికిగానీ ఆ స్మృతులను మరచిపోలేకపోయాడు.
ఓ నెల గడిచింది. ఏదో పనిమీద రావుడికి అమలాపురం వెళ్ళవలసి వచ్చింది. ఈ సారి కోటిపల్లి మీదుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
తన చిన్ననాటి స్నేహితుడి కోరిక నెరవేర్చడానికి దుప్పటీ కొనాలని అనుకున్నాడు. దుకాణానికి వెళ్ళేడు. రావుడి దగ్గర పుష్కలంగా డబ్బుంది. కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో అతనిలో వచ్చేసింది. ఆరు రూపాయలిచ్చి ఓ దుప్పటీ కొన్నాడు.
ఉదయాన్నే బస్సెక్కి బయలుదేరేడు రావుడు. కోటిపల్లి చేరేసరికి తొమ్మిదైంది. లాంచీ గోదావరిలో సగం దూరం వచ్చేసరికి సోమన్న పాక కనపడుతోంది.
తనని చూసి సోమన్న పిలుస్తాడు. పిలవకపోయినా తనే పాకలోకి పోయి, రెండు నేతి పెసరట్లు కాల్పించుకుని తిని సోమన్నకి దుప్పటీ ఇవ్వాలి. రావుడు ఆలోచనలలో ఉండగా లాంచీ ఒడ్డుకు చేరింది.
అతను దిగి, సంచీ పుచ్చుకుని ముందుకు నడుస్తున్నాడు. సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు. అందులో సోమన్నకి అన్నగారైన వెంకటప్పయ్య ఒకడు.
“ఏమోయ్ , ఇల్లావచ్చావ్?” అన్నాడు రావుడు వెంకటప్పయ్యతో. కానీ వెంకటప్పయ్య ఏమీ బదులు చెప్పకుండా పాకలోకి వెళ్ళేడు. రావుడు కూడా వెనకాలే లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఒకడు అతని జబ్బ పట్టుకుని ఆపేడు. రావుడు పక్కకి తిరిగి, “సోమన్న?” అన్నాడు.
“సోవన్నగారు సచ్చిపోయారు. రేత్రి నాలుగు డోకులెళ్ళాయి,” అన్నాడు.
రావుడికి అంతా అర్థమైంది. అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వెంకటప్పయ్య సోమన్న శవాన్ని ఇవతలికి తెచ్చాడు. చాలా నీరసించి, పీక్కుపోయి ఉంది ఆకృతి. శవాన్ని గంపలో కూచోబెట్టి, “ఏదైనా గుడ్డ కప్పాలి,” అన్నాడు వెంకటప్పయ్య.
రావుడు తలవంచుకుని, తన సంచీలోంచి కొత్త దుప్పటి తీసి సోమన్నకి కప్పేడు. * * *
చక్కటి అనుభూతులను పంచుతూనే రచయిత ఈ కథలో మనిషిలో పిసినారితనం ఎంత లోతుగా ఉంటుంది..? దాని ప్రభావం ఎటువంటి పరిణామాలు కలుగచేస్తుంది అనే విషయాన్ని ఎంతో సహజంగా చిత్రీకరించారు. లోభం మనిషిలో ఒక సాధారణ బలహీనత అని రావుడి ద్వారా చెప్పేరు.
సోమన్న నిస్వార్థంగా, వయోభేదం లేకుండా పిల్లలతో మైత్రి నెరపినవాడు. ఈవాల్టికికూడా డబ్బులు తీసుకోకుండా పెసరట్టు నేతితో కాల్చి తినిపించినవాడు. రావుడిలో నిద్రాణమై ఉన్న గతకాలపు మధురానుభూతులను తట్టి లేపినవాడు.
కానీ, రావుడు?? ఒక్క దుప్పటీ గుడ్డ అడిగితే ఏదో కారణం చెప్పుకుని తప్పుకున్నాడు. ఇవ్వాలని లేక కాదు… అంత ఖరీదుది ఎందుకనే లోభగుణం. చివరికి తను కొనదలుచుకున్న ఖరీదులోనే కొన్నాడు….కానీ అది సోమన్న శవం మీద కప్పడానికే ఉపయోగపడింది కానీ బతికుండగా అతన్ని చలినుంచి కాపాడలేక పోయింది.
చెయ్యదలుచుకున్న పని….ముఖ్యంగా దాన ధర్మాల వంటివి వెంటనే తక్షణమే చేసేయాలి. లేకపోతే ఈ దిక్కుమాలిన మనసు మాయ చేస్తుంది. వేరే ఆలోచనలు వస్తాయి. వాటిని సమర్థించుకునే తర్కం పుట్టుకొస్తుంది. నువ్వు ఇవ్వదలుచుకున్నది వాయిదా వేస్తే, రేపు పుచ్చుకునేందుకు వాడు ఉండకపోవచ్చు….ఇచ్చేందుకు నువ్వూ లేకపోవచ్చు.
కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు… ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే!
1.నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు…ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం.
నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా!
తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో.తప్పకుండా తను కూడా మంచి గృహిణి గా,మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది.
2.నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో…
నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని..నీవు మమ్మల్ని,నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని ప్రేమగా ఉండాలి.
3.నీతో సమానంగా తనని చూసుకో…నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో!నీ మంచిచెడులో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది.
4. పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి…కాస్త మోహమటంగా ఉండచ్చు…నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యి.
5.నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి…
ప్రేమించడానికి వయస్సుతో పనిలేదు.చిన్న,చిన్న సర్ప్రైజ్ లు,కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో..వారాంతంలో బయటికి తీసుకుని వెళ్లు. పుట్టింటికి తనతో కలసి వెళ్ళు.
నీ లాంటి భర్త, మా లాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనం అందరం ప్రవర్తిద్దాం…
ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను…అనుభవిస్తున్నాను..నా అనుభవాలను నీతో చెపుతున్నాను…నువ్వు కూడా మీ నాన్నలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ,నువ్వు సంతోషంగా ఉంటూ…మమ్మల్ని సంతోషంగా ఉంచుతావని నమ్ముతున్నాను…నిండు నూరేళ్లు ఆనందంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను…ఇష్టకామ్య ర్థ సిద్ధి రస్తు….❤
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో యెందుకు వగచేవో ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు యున్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా….
నోట్: మీకు నచ్చితే ఆచరించండి!
లేకపోతే వదిలేయ్యండి!
అంతేగానీ ఏంటీ శ్రీ రంగనీతులు
అని మాత్రం అనుకోకండి!
మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.
1. అర్ధ దోషం
2. నిమిత్త దోషం
3. స్ధాన దోషం
4. గుణ దోషం
5. సంస్కార దోషం.
ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.
🔸 అర్ధ దోషం
ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.
భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది.
హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.
తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.
తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.
వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.
శిష్యుడు తలవంచుకొని, “నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు.” అని తలవంచుకొన్నాడు.
ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.
🔸 నిమిత్త దోషం
మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.
వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.
అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి.
భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.
అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.
ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
‘అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.
నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం – బిందువులుగా బయటికి పోయి నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.
నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.
చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *’నిమిత్త దోషం ‘* ఏర్పడుతోంది.
🔸 స్ధాన దోషం
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.
యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.
దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, “విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు.
మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి
🔸 గుణ దోషం
మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.
🔸సంస్కారదోషం
ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.
సర్వేజనా సుఖినో భవంతు